జనసేన బలమైన సంతకం ఎల్లో పేపర్ మీదే..
15 Mar, 2023 11:43 IST
తాడేపల్లి: పవన్ కల్యాణ్‌కు జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తనదైన శైలిలో చురకలు అంటిస్తూ ట్వీట్లు చేశారు.. `ప్యాకేజీ అంటే చెప్పు తీస్తావ్.. అమ్ముడుపోయావని ఆంధ్రజ్యోతి పత్రిక రాస్తే....?` ఏం చేశావ్ అని పవన్‌ను ప్రశ్నించారు. అదే విధంగా `కాపులందరూ నడుం బిగించండి.. నాదెండ్ల, కల్యాణ్ బాబు ప్యాకేజీ బిగాస్తారు` అని సెటైర్లు వేశారు. మరో ట్వీట్‌లో ``జనసేన పదో ఆవిర్భావ దినోత్సవ సందేశం.. వచ్చే ఎన్నికల్లో జనసేనది బలమైన సంతకం ఉంటుంది.. కానీ, అది ఎల్లో పేపర్ మీదే ఉంటుంది`` అని పవన్‌కు చురకలు అంటిస్తూ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.