మేస్త్రి ఏమి చేయగలడు ?
23 Dec, 2023 17:24 IST
పల్నాడు: తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్‌తో భారతీయ ఎన్నికల వ్యూహకర్త, రాజకీయవేత్త, జనతాదళ్(యునైటెడ్) కు చెందిన ప్రశాంత్ కిషోర్ భేటీ కానున్నట్లు వచ్చిన వార్తల పట్ల మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. మెటీరియలే మంచిది కాకపోతే మేస్త్రి ఏమి చేయగలడు ? అంటూ నారా లోకేష్‌ను ట్యాగ్ చేస్తూ మంత్రి అంబటి రాంబాబు తన ఎక్స్(ట్విట్టర్)లో పోస్టు చేశాడు. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.