జనసైనికులూ ఆలోచించండి
14 Sep, 2023 15:24 IST
గుంటూరు: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో ఏ-1 నిందితుడిగా ఉన్న చంద్రబాబుతో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురువారం సెంట్రల్ జైల్‌లో ములాఖత్ అయ్యారు. అనంతరం పవన్ కళ్యాణ్.. టీడీపీతో పొత్తును ప్రకటించారు. ఈ విషయంపై మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. జనసైనికులూ ఆలోచించండి..ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడిలా లేదూ..ఇప్పుడే నిర్ణయం తీసుకున్నామంటే ఎవరైనా నమ్ముతారా? అంటూ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.