జోరు తగ్గించవయ్యా.. జోకర్ బాలయ్య ..!
24 Sep, 2022 15:57 IST
గుంటూరు: హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చిన మూడు రోజులకు ఎన్టీఆర్ కుమారుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకు స్పందించడం పట్ల మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్లో సెట్టైర్లు వేశారు. మార్చెయ్యడానికి, తీసెయ్యడానికి ఎన్టీఆర్ అన్నది పేరు కాదని బాలకృష్ణ కామెంట్ చేశారు. ఆయన వ్యాఖ్యలపై మంత్రి స్పందిస్తూ జోరు తగ్గించవయ్యా..జోకర్ బాలయ్య అంటూ అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.