చంద్రబాబుకు, పవన్ కల్యాణ్ కు సరైన మొగుడు...జగన్ గారే
రాజమండ్రి: రాజకీయాల్లో చంద్రబాబుకు, పవన్ కల్యాణ్ కు సరైన మొగుడు...సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అంటూ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పవన్ కల్యాణ్ నాలుగో పెళ్లాం నాదెండ్ల మనోహర్. సీఎం వైయస్ జగన్‌ను తొక్కేస్తానంటూ పిచ్చి మాటలు మాట్లాడాడు. లేకుంటే తన పేరు పవన్ కల్యాణే కాదని అన్నాడు. అవును.. ఆయన పేరు పవన్ కల్యాణ్ కాదు. వైయస్ జగన్‌ను అధఃపాతాళానికి తొక్కాలంటే.. పవన్‌ను పుట్టించిన వాళ్లు రావాలి. ఏది అనుకున్నాడో దాని గురించి నిలబడే నాయకుడు వైయస్ జగన్. అలాంటిది సీఎం వైయస్ జగన్ గురించి మాట్లాడే నైతిక హక్కు పవన్‌కు లేదు. జనసైనికులను అడిగితే పవన్ గొప్పో.. జగన్ గొప్పో చెబుతారు అన్నారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.
పవర్ షేరింగ్ మాటెత్తకుండా పవర్‌స్టార్ అంటూ పొగిడారు:
– తాడేపల్లిగూడెంలో జెండా సభ 4 గంటలకు ఎనౌన్స్‌చేస్తే ఆరు గంటలకు సభ జరిగింది.
– 4 గంటలకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ వచ్చారు కానీ జనం రాలేదు.
– రెండు గంటలు జనం కోసం వెయిట్ చేసి 6 గంటలకు సభను ప్రారంభించారు.
– దీన్ని చూస్తే తెలుస్తుంది సభ ఎంత సక్సెస్ అయ్యిందో.
– పవన్ కల్యాణ్ కంటే ముందు చంద్రబాబు మాట్లాడాడు.
– ముందు మాట్లాడిన వాళ్లంతా పవన్‌ను పవర్ స్టార్ అన్నారు...
– దీంతో జనసేన కార్యకర్తలు ఆశతో పవర్ షేరింగ్ గురించి మాట్లాడతారేమో, హరిరామజోగయ్య సూచన మేరకు ఏదైనా పవర్ ఇస్తారేమో అనుకుంటే అదేమీ మాట్లాడలేదు.
– చంద్రబాబు ఎప్పటి మాదిరిగా ఆవేశంగా జగన్ గారిని దూషించే కార్యక్రమం, పవన్ కల్యాణ్‌ను పొగిడే కార్యక్రమం చేశాడు.
– ఈ సందర్భంలో మేం ఒకరి వెనుక ఒకరు నడవడం లేదు..ఉమ్మడిగా నడుస్తున్నాం అన్నాడు.
– జనసేన కార్యకర్తలు చెవుల్లో పూలు పెట్టుకున్నారనుకున్నాడేమో...24 సీట్లు ఇచ్చి సమానంగా నడుస్తున్నాం అని చంద్రబాబు తన చాకచక్యాన్ని ప్రదర్శించారు.
– ఈ పొత్తు మాకోసం కాదు..ప్రజల కోసం అని చంద్రబాబు అన్నాడు. తాను ముఖ్యమంత్రి కావడం కోసం కాదని చంద్రబాబు మాట్లాడటం ఆశ్చర్యం వేసింది.
– చంద్రబాబు మీకు పదవి మీద ఇంట్రస్ట్ లేదని చెప్పారు కాబట్టి పవర్ షేరింగ్ గురించి మాట్లాడాల్సింది కదా?
– ఎక్కడన్నా బావా అంటే ఒప్పుకుంటాడు కానీ..వంగ తోట దగ్గర మాత్రం బావ కాదు అన్నట్లుంది.
– పవర్ విషయంలో మాత్రం తాను తప్ప వేరే వారు ముఖ్యమంత్రి అయితే ఒప్పుకోనే అని బాడీలాంగ్వేజ్ ద్వారా క్లియర్‌గా చెప్పేశాడు.
– నేను అగ్నిని, నిప్పు కణాన్ని..అగ్నికి తోడు వాయువు తోడైంది అంటున్నాడు.
– అసలు ఈ సామెత మంచిదేనా? అగ్నికి వాయువు తోడైతే ఏమవుతుంది? నాశనం అవుతుంది.
– ఆ సన్నాసికి ఈ సన్నాసి తోడయ్యాడురా..నాశనం అయిపోతుంది అంటుంటారు.
– అదే పద్దతుల్లో అగ్నికి వాయువు తోడైంది..వీరిద్దరూ రాజకీయాలను, రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారు.
– ఒక్క సారి మా సిద్ధం సభలు చూడండి...మీ సభలు ఎలా జరిగాయో చూడండి.
– సిద్ధం సభను, జెండా సభ వేదిక చూడండి...వాస్తవం మీకే అర్ధం అవుతుంది.
– 4 గంటలకు ప్రారంభించాల్సిన సభను 6గంటల వరకూ జనం రాకపోతే బిక్కు బిక్కు మంటూ మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది.
– ఉత్సాహాన్ని ఏ మాత్రం పెంపొందించని సభగా విశ్లేషకులు తేల్చి చెప్పేశారు.
ప్రశ్నించడానికే పుట్టిన పార్టీకి ప్రశ్నించే వారు అవసరం లేదట:
– పవన్ కల్యాణ్ ఏం మాట్లాడాడో మీకెవరికైనా అర్ధం అయ్యిందా?
– అసలు అతను రాజకీయాలకు పనికి వచ్చే వ్యక్తేనా?
– ఎంత ఆవేశంగా, అధ్వాన్నంగా, వెకిలిగా మాట్లాడుతున్నాడో రాష్ట్రం అంతా చూసింది.
– మక్కెలు ఇరగదన్ని మడత మంచంలో పెడతావా? ఎవరు రాశారు ఈ డైలాగు..? త్రివిక్రమ్ రాశాడా?
– అసలు మనకు 24 సీట్లు తీసుకునే శక్తి ఉందా అంటున్నాడు.
– ఒక రాజకీయ పార్టీ ఏదైనా మాకు అపారమైన బలముందని, ఉద్ధండులైన కార్యకర్తలు, నాయకులున్నారని చెప్పుకుంటారు.
– కానీ మనకి 24 సీట్లు ఇవ్వడమే ఎక్కువ అని చెప్పుకునే ఖర్మేంటి?
– అధ్వాన్నంగా ఉన్న పార్టీకి చంద్రబాబు 24 సీట్లు ఇవ్వడం గొప్ప అంటున్నాడంటే ఆ పార్టీ కార్యకర్తలు ఆలోచించుకోవాలి.
– చంద్రబాబును దేహీ అని నేను 24 సీట్లు తీసుకొచ్చాను అంటుంటే సిగ్గుందా మీకు..?
– నన్ను ప్రశ్నిస్తారా అంటున్నాడు..అసలు మీది ప్రశ్నించడానికే పెట్టిన పార్టీ అన్నావే..?
– ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో హక్కు అన్నావే..ఇప్పుడు ప్రశ్నించే వారు నాకు అవసరం లేదంటున్నాడు.
– నన్ను మెచ్చుకున్నోడే నా దగ్గర ఉండాలి..24 సీట్లు ఎందుకు తీసుకున్నావ్ అని అడిగితే ఒప్పుకోను అంటున్నాడు.
– నేను చాలా సందర్భాల్లో చెప్పా..ఇప్పుడూ చెప్తున్నా. పవన్ కల్యాణ్ అనే వ్యక్తికి రాజకీయాలకు పనికి రాని వ్యక్తి.
– నిన్ను నమ్ముకున్న అమాయకమైన జనం, కులస్థులు..వాళ్లేదో నువ్వు ముఖ్యమంత్రి అవుతావు అనుకున్నారు.
– అసలు ముఖ్యమంత్రి కాకపోతే సరే...అసలు సీఎంకి పనికిరాను అని నువ్వు మాట్లాడుతున్నావు.
– పవన్ కల్యాణ్‌ను నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్లే అని నేను చాలా సార్లు చెప్పాను.
– పవన్ కల్యాణ్ సీఎం కావాలని కోరుకునే వాళ్లు చంద్రబాబు సీఎం అని అంటారా? అనగలరా?
– ఇలాంటి పరిస్థితికి ఎందుకు మీ రాజకీయ పక్షం దిగజారిపోయిందో ఆలోచించుకోవాలి.
– అదేమంటే ఏయ్..జగన్ అంటూ అరుస్తున్నాడు. నాలో మంచితనాన్ని, శాంతిని చూశావ్..ఇక చూస్తావ్ అంటున్నాడు..
– ఏం చూస్తావయ్యా..? ఈ డైలాగు ఎన్నిసార్లు చెప్పావు..?
– ఎవర్ని బెదిరిస్తావయ్యా పవన్ కల్యాణ్..దమ్ముంటే చంద్రబాబును బెదిరించి నాలుగు సీట్లు తెచ్చుకో.
– ఒక్కసారి నీ కార్యకర్తలను రహస్యంగా అడుగు..చంద్రబాబు గొప్పోడో, జగన్ గొప్పోడో చెప్తారు.
– జగన్ వీరుడని, ఏకాడికైనా జగన్ పోరాడగలిగిన వ్యక్తి అని చెప్తారు.
– ఈ రాష్ట్రాన్ని రాబోయే కాలంలో మళ్లీ పరిపాలన చేయడానికి ప్రజల మన్నన పొందుతున్న వ్యక్తి అని వాళ్లే చెప్తారు.
– జనసేన, టీడీపీ కార్యకర్తల అంతరాత్మల్లో జగన్ మగాడు అనే మాటుంది.
స్కిల్ దొంగ చంద్రబాబు జైలుకెళితే నీకు బాధ కలిగిందా?:
– నాలుగు దశాబ్ధాల చరిత్ర ఉన్న ఉద్ధండుడు చంద్రబాబును 52 రోజులు జైల్లో పెడితే నాకు బాదేసింది అని విలపించాడు.
– ఏవండీ పవన్ కల్యాణ్ గారు..మీకు అంత బాదేసిందే..వంగవీటి మోహనరంగా గారిని నడిరోడ్డులో నరికినప్పుడు నీకు బాధ కలగలేదా?
– నీతి నిజాయితీ కలిగిన వ్యక్తి, కాపుల కోసం పోరాడిన ముద్రగడను కొట్టినప్పుడు, వారి భార్య పిల్లలను వేధించినప్పుడు మీకు బాధ కలగలేదా?
– చంద్రబాబు స్కిల్ స్కాంలో దొంగలా దొరికితే బాధ కలిగిందా?
– తెచ్చిపెట్టుకున్న ఆవేశం, అరుపులు, కేకలతో ఇదేనా రాజకీయం?
– జగన్‌గారిపై విరుచుకుపడే మాటలు..ఆయన్ను అథోపాతాళానికి తొక్కేస్తాడట.
– జగన్ గారిని అథోపాతాళానికి తొక్కడానికి నిన్ను పుట్టించిన వాడు రావాలి.
– ఆ శక్తి నీకుందా? నీ అంతరాత్మను అడుగు..జగన్ గారి గురించి మాట్లాడే నైతిక అర్హత లేని వ్యక్తివి నువ్వు.
– తండ్రి మరణిస్తే రాజకీయాల్లోకి వచ్చి ధైర్యంగా ముందుకు వెళ్లిన వ్యక్తి జగన్ గారు.
– అనుకున్నది సాధించేందుకు రాజీపడని పోరాటం చేసే వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి.
– నేను తొక్కకపోతే నా పేరు పవన్ కల్యాణ్ కాదు అన్నాడు. ఈ మాట మీద నిలబడు.
– నీ పేరు అసలు పవన్ కల్యాణ్ కాదు.
– ఈయనతో స్నేహం చేస్తే చచ్చేవరకూ అంటున్నాడు. సీపీఐ, సీపీఎంలతో స్నేహం చేశావుగా చచ్చేదాకా ఉందా?
– శతృత్వం కూడా చచ్చేదాకా అన్నావు. చంద్రబాబు, లోకేశ్‌తో కూడా శతృత్వం అన్నావు..ఆ శతృత్వం ఎక్కడికి పోయింది.
– అసలు నువ్వు మాట మీద నిలబడేవాడివేనా? అసలు ఒక చోట నిలబడే వాడివేనా?
చంద్రబాబుకు, పవన్ కల్యాణ్ కు సరైన మొగుడు...జగన్ గారే:
– నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నారు అంటూ అరుస్తున్నాడు.
– నీ దగ్గర జగన్ గురించి నా దగ్గర సమాచారం ఉంది అంటూ బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నాడు.
– టన్నుల కొద్దీ సమాచారం ఉంటే ఇవ్వు..ఇలా చీఫ్ బ్లాక్ మెయిల్ ఎందుకు?
– నీ దగ్గర ఏదన్నా ఉంటే దమ్ముంటే చెప్పవయ్యా?
– నీకు మొదటి పెళ్లి కాలేదా? రెండో పెళ్లి..మూడో పెళ్లి కాలేదా?
– నాలుగో పెళ్లాం నువ్వా అంటున్నావ్..నాలుగో పెళ్లాం నాదెండ్ల మనోహర్ అని మాతో చెప్పించుకోవాలా?
– జగన్‌మోహన్‌రెడ్డి పెళ్లాం కాదు..నీకూ, చంద్రబాబుకు మొగుడు జగన్.
– ఏమాటకు ఆమాట చెప్పాలి. తెలుగుదేశం కొంత లిమిట్స్‌లో మాట్లాడతారు. కానీ ఇతను మరీ అతని చేస్తున్నాడు.
– జనసేన కార్యకర్తలారా..పునరాలోచించుకోండి. ఇతని వల్ల రాజకీయ పార్టీ నడపడం కాదు.
– చంద్రబాబు భుజం మీదో వేసి వెళ్లిపోతాడు..పవన్ కల్యాణ్ రాజకీయాల్లో ఆటలో అరటి పండులా ఉండేవాడు మాత్రమే.
– అసలు 24 మందిని తీసుకోవడం మాత్రం ఎందుకు..? ఆ 24 మంది అభ్యర్థులు కూడా నీకు దొరకడం లేదు.
– ఈ పదేళ్లలో 175 సీట్లలో 175 మందిని పెట్టి గెలిపించుకోవాలనే కోరిక, చిత్తశుద్ధి నీకు ఎప్పుడైనా ఉందా?
– అప్పుడప్పుడు రావడం, గిల్లడం, తిట్టడం పోవడం తప్ప ఏముంది నీ రాజకీయం?
– అదేమంటే రెండు చెప్పులెత్తి విసరడం తప్ప ఏమీ తెలియదు.
– కొన్నాళ్లు పోయిన తర్వాత చంద్రబాబే ఇతనితో ఎందుకు పొత్తు పెట్టుకున్నాను అని బాధపడే పరిస్థితి వస్తుంది.
– ఈ పొత్తు విజయవంతమైన పొత్తు అని వారే చెప్తున్నారు..అది అట్టర్ ప్లాప్ పొత్తు.
– వన్+వన్ రాజకీయాల్లో రెండు అయ్యే అవసరం లేదు. వన్+వన్ జీరో అవుతుంది కూడా.
– ముందు చంద్రబాబు మాట్లాడారు..అప్పటి వరకూ కొంతమంది జనం ఉన్నారు..ఆ తర్వాత వాళ్లూ లేచివెళ్లిపోయారు.
– పవన్ మాట్లాడే సమయానికి సభ వెలవెలబోయింది.
– పవన్ కల్యాణ్ మాట్లాడే వరకూ టీడీపీ జనం ఉండలేకపోతే ఇక వాళ్లు ఎప్పుడు ఓట్లేస్తారు?
– మీరు రాసిపెట్టుకోండి..175 సీట్లూ గెలిచి జగన్ గారు సీఎం కాబోతున్నారు.
మీడియా ప్రశ్నలకు సమాధానం..
– ముద్రగడ గారు వైయస్ఆర్ సీపీలోకి వస్తున్నారనే విషయం నాకు తెలియదు.
– వారిద్దరు లెటర్లు రాసిన విషయం నాకు తెలుసు. హరిరామజోగయ్య గారు మాత్రం మీకో దండం అని చేతులు పైకెత్తారు.
– ముద్రగడ గారు కూడా లేఖ రాశారు. మా ఇంటికి వస్తానని రాలేదని చెప్పారు.
– మాకు గిట్టినా గిట్టకపోయినా వారు కాపు సామాజిక వర్గంలో పెద్దలు.
– ప్రశ్నించడానికే పుట్టిన పార్టీకి ప్రశ్నించే వాడు అవసరం లేదు. దరువు వేసే వాడే కావాలి.
– ఆ దరువు వేసే వాడు ఒకే ఒక్కడు..నాదెండ్ల మనోహర్..
– జనసేన అనే రాజకీయ పక్షం రాజకీయ పక్షం కాదు..అది అమ్ముడు పోయే పక్షం అని చెప్పే బ్రాండ్ అంబాసిడర్ నేనే.
– చంద్రబాబు గెలవడమే డౌట్..ఇక పవన్ కల్యాణ్ ఎక్కడ గెలుస్తాడు..?
– పవన్ కల్యాణ్ పోటీ చేసిన చోట వెన్నుపోటు వేయడంలో అనుమానమే లేదు.
– వైనాట్ పులివెందుల డైలాగ్ బాగుందిగా..రాబోయే రోజుల్లో చూద్దాం ఎవరు గెలుస్తారో?.
– కుప్పంలోనే ఓడిపోబోతున్నారు అని మేం అంటే..వాళ్లు పులివెందుల అంటున్నారు. మమ్మల్ని అనుకరించడం తప్ప వాళ్లదగ్గర ఏమీ లేదు.
– బీజేపీతో పొత్తులో ఉన్నామని వీళ్లు చెప్పుకుంటున్నారు తప్ప వాళ్లు మాత్రం చెప్పడం లేదు.
– మాకేం అభ్యంతరం లేదు. వాళ్లను కూడా చెప్పమనండి. ముగ్గురు కలిసి వచ్చినా మాకేం అభ్యంతరం లేదు.
– అసలు జనసేన అనేది బీజేపీతో పొత్తులో ఉందా? లేదా? ఉంటే ఈ డ్రామా ఏంటి?
– చచ్చేంతవరకూ నాతో స్నేహం అంటున్న పెద్దమనిషి దీనికి ఏం చెప్తాడు..?
– బీజేపీతో పొత్తులో ఉండి వారి అనుమతి లేకుండానే జైలు వద్దకు వచ్చి మేం పొత్తుకు వెళ్తున్నాం చెప్పే అనైతికమైన రాజకీయవేత్త పవన్‌కల్యాణ్.
– పెళ్ళికి వెళ్తూ పిల్లిని చంకన పెట్టుకుని వెళ్లడం ఎందుకని లోకేశ్‌ను రావద్దని వాళ్ళ నాన్న గారు చెప్పిఉంటారు.