రాష్ట్ర ప్రయోజనాలే సీఎం వైయస్ జగన్‌కు ముఖ్యం
పల్నాడు: రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. నీటి పంపకాల విషయంలో రాజీపడేది లేదని మంత్రి స్పష్టం చేశారు. నీటి విషయంలో ఎల్లోమీడియా ఇష్టానుసారంగా కథనాలు ప్రచురిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అంబటి రాంబాబు శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబు రైతులపాలిట ద్రోహిగా నిలిచిపోయారు. కృష్ణా జలాల్లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగింది. పచ్చ పత్రికలు రాతలు రోతలుగా రాస్తున్నాయి. కొన్ని పత్రికలు మాత్రం విషం చిమ్ముతున్నాయి. మద్దతు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ.. ఇలాంటి తప్పుడు కథనాలు వద్దు. మన నీటిని సద్వినియోగం చేసుకోలేకపోవడానికి చంద్రబాబే కారణం. ఏపీకి రావాల్సిన నీటి వాటా గురించి సీఎం వైయస్ జగన్ పోరాడారు. తెలంగాణ ఎక్కువ నీళ్లు వాడుకుంటోంది. నీటి పంపకాల విషయంలో రాజీపడేది లేదు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. కృష్ణా జలాలపై తప్ప మిగిలిన విషయాలు మాట్లాడారు. నీకు బ్యానర్ కట్టిన వ్యక్తిని కూడా నువ్వు పార్టీలో నిలుపుకోలేకపోయావు. ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్న వారు కూడా తర్వాత ఉండరు. చంద్రబాబు కోసమే పవన్ పనిచేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు ఘాటు విమర్శలు చేశారు.
రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో ఇంకా ఏం మాట్లాడారంటే:
నీకు బ్యానర్ కట్టిన వారినీ నిలుపుకోలేకపోయినందుకు నువ్వు సిగ్గు పడాలి పవన్:
- పవన్ కల్యాణ్ నందగిరి హిల్స్‌లో ఉన్నప్పుడు ఆయనకు బ్యానర్లు కట్టిన వారిని కూడా ఈ ప్రభుత్వంలో మంత్రిని చేశారట.
- ఈ మాట అనడానికి పవన్ కల్యాణ్‌కు సిగ్గుపడాలి. నీకు బ్యానర్ కట్టిన వ్యక్తిని కూడా నువ్వు నిలుపుకోలేకపోయావు.
- నీకు బ్యానర్ కట్టిన వారికి కూడా మంత్రి పదవి ఇచ్చిన ఘనత జగన్ గారిది.
- నీకు బ్యానర్ కట్టిన వారు కూడా నీ పక్కన నిలబడే పరిస్థితి లేదు. ఇప్పుడున్న వాళ్లు కూడా ఇక ఉండరు.
- నువ్వు చంద్రబాబుకు బ్యానర్లు కట్టమని నీ జనసేన కార్యకర్తలకు చెప్తున్నావు.
- నీకు బ్యానర్ కట్టడానికి వాళ్లు వస్తే నువ్వు చంద్రబాబుకు బ్యానర్లు కట్టమంటున్నావు.
- ఇక నీ పక్కన ఎవరుంటారు..ఇప్పుడున్న వారు కూడా ఉండరు.
- ఆయన సమసమాజం గురించి ఆలోచించేటప్పుడు జగన్ గారు డబ్బులు లెక్కేసుకుంటున్నాడట.
- అసలు నువ్వు సమసమాజం గురించి ఆలోచించే వ్యక్తివేనా?
- టీడీపీతో కలిసి చిన్నకులాలకు అధికారం కోసం ప్రయత్నం చచేస్తున్నావా? అధికారం లేని కులానికి సేవ చేస్తునానవా?
- నువ్వు తెలంగాణలో నిలబెట్టిన 8 సీట్లకు కూడా మద్దతు పలకని పార్టీని అధికారంలోకి తీసుకురమ్మని అడుగుతున్నావంటే నీకు సిగ్గు లేదు..
- నీ అంత దౌర్భాగ్యమైన రాజకీయాలు చేసే వాడు మరొకడు ఉండడు.
- చంద్రబాబు, లోకేశ్ ఇద్దరూ నిన్ను తిట్టారు..అయినా వారినే భుజాన వేసుకుని తిరుగుతున్నావు.
- పవన్ కల్యాణ్ వద్ద ఎవరూ ఉండరు..చంద్రబాబు భుజాన పెట్టుకుని మోయాలనే ప్రయత్నాన్ని జనసేన కార్యకర్తలు గమనించాలి.
కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ నేడు అదే పార్టీ గెలవాలనుకుంటోంది:
- టీడీపీ 1983లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ. అప్పటి నుంచి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగానే ఉంది.
- మధ్యలో చంద్రబాబు తెలంగాణలో కాంగ్రెస్‌తో కలిశాడు..జనం ఛీకొట్టారు.
- నేడు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందంటే చంకలు గుద్దుకుంటున్నారు.
- ఎక్కడకు దిగజారిపోయారు..? చివరికి మీరు పెరిగారా తరిగారా అనేది ఆలోచించుకోండి.
- చంద్రబాబు, లోకేశ్ నాయకత్వంలో టీడీపీ అంతగా దిగజారిపోయింది.
- తెలంగాణలో టీడీపీ ఎలా అదృశ్యమైందో ఏపీలోనూ అలానే అదృశ్యమవుతుంది.
- మేమిద్దరం కలిస్తే అధికారంలోకి వస్తామని పవన్ చెప్తున్నాడు. అంటే కలవకపోతే తాము అధికారంలోకి రాలేమని చెప్తున్నాడు.
- రెండు మూడు శాతం ఓట్లతో జగన్ అధికారంలోకి వస్తే చాలా అన్యాయం జరుగుతుంది..అందుకే మేం కలుస్తున్నాం అంటున్నాడు.
- మీరు కలిస్తే జగన్ గారికి రెండు మూడు కాదు..ఐదు శాతం ఓట్లు పెరుగుతాయి.
- మీ కలయికను ఎవరూ హర్షించడం లేదు...సహించడం లేదు. లాజికల్‌గా మీరు కరెక్ట్ కాదని ప్రజల అభిప్రాయం. మీ కార్యకర్తల అభిప్రాయం కూడా అదే.
- పదో పరకో సీట్లు, నోట్లు తీసుకుని ఆ పార్టీతో కలిసి ఆ పార్టీని గెలిపించాలని నువ్వు పవడే తాపత్రమయానికి అర్ధం లేదు.
- రోజుకు 0.5 శాతం తగ్గాలని పవన్ కల్యాణ్ అంటున్నాడు. రానున్న ఎన్నికల్లో నీకున్న ఐదు శాతం కూడా పోయి నీకు ఆ 0.5 శాతమే మిగులుతుంది.
- ఈ వాస్తవాన్ని నువ్వు తెలుసుకోడానికి సమయం పడుతుంది.
అసలు పవన్ కల్యాణ్ రాజకీయ నాయకుడే కాదు..అతనికి రాజకీయాలు తెలియవు:
- పదేళ్లు పార్టీని నడిపిన అనుభవజ్ఞుడను అంటున్నాడు..ఏం నడిపావో అర్ధం కావడం లేదు. నీ పార్టీలో గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా ఇప్పుడు నీతో లేడు. అదీ నీ అనుభవం.
- నీకు 175 నియోజకవర్గాలకు అభ్యర్థులున్నారా? నీకు టీడీపీ కొంపదీసి ఇరవై ముప్పై సీట్లు ఇచ్చినా అభ్యర్థులు లేరు. అభ్యర్థులను కూడా టీడీపీ నుంచి తెచ్చుకోవాలి.
- పిల్లలు ఈలలు, కేకలు వేస్తే అదే ప్రజాదరణ అనుకుంటే పొరపాటు.
- నీకు ఫుల్‌టైం రాజకీయాలు చేయడం నీవల్ల కాదు. నీకు రాజకీయాలే తెలియదు..నువ్వు రాజకీయ నాయకుడివే కాదు.
- ఓ పక్క సమసమాజ నిర్మాణం అంటూ టీడీపీతో కలిశావంటేనే నువ్వేంటో అర్ధం అవుతుంది.
- కలిసి నడుస్తాను అంటున్న నువ్వు సగం సీట్లు తీసుకుంటే నువ్వు కలిసి నడిచినట్లు. లేదు పాతికో పరకో తీసుకుంటే వారి వెనుక నడిచినట్లే.
- మా కలయిక ఇష్టమైతే ఉండండి..లేదంటే వెళ్లిపోండి అంటున్నాడు.
- మేం ప్రేమికులం..లేచిపోయి అయినా పెళ్లి చేసుకుంటాం అంటున్నాడు.
- ఇంకెందుకు జనసేన కార్యకర్తలు సిగ్గులేకుండా అతనితో ఉండటం..?
- అతనికి బ్యానర్లు కట్టిన వారి కన్నా..పవన్ గెలవాలి అని కోరుకునే వారికన్నా..ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వారికన్నా తనకు చంద్రబాబే ముఖ్యం అంటున్నాడు.
- చంద్రబాబు వద్ద ఏముందయ్యా...14 ఏళ్లు రాష్ట్రాన్ని దోచుకున్నాడు.
- మీరిద్దరూ కలిసినా మీరు గెలవలేరు. జగన్ గారే ఈ రాష్ట్రానికి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు.
- నువ్వు తెలంగాణలో ఓడిపోతే ఇక్కడ టీడీపీ వారు సంకలు గుద్దుకోవాలని చూస్తున్నారు.
- ఇదేమన్నా సినిమా అనుకుంటున్నాడా యుద్ధం చేయడానికి..?
- అసలు యుద్ధం చేయడం నీకెక్కడ వచ్చు పవన్ కల్యాణ్...?
- మైకుల ముందు అరవడం తప్ప నీకు యుద్ధం చేయడం వచ్చా..?
- నీకు నిజంగా యుద్ధం చేయడమే వస్తే ఈ పదేళ్లలో ఎక్కడ యుద్ధం చేశావో చెప్పు.
- ప్రాక్టికల్‌గా యుద్ధం చేయలేక..మానసికంగా ఇబ్బంది పడే ఒక మానసిక రోగిలా ప్రవర్తిస్తున్నాడు తప్ప పవన్‌కి యుద్ధం చేయడం ఏమి తెలుసు.
- పవన్, చంద్రబాబు ఇద్దరూ మానిప్యులేటర్స్..అలా రాజ్యాధికారం పొందాలనుకుంటే రాదు.
- ప్రజల కోసం యుద్ధం చేయాలి..శ్రమ పడాలి..ప్రజల కోసమే బతకాలి..వారి కోసమే పరిపాలన చేయాలి..అలాంటి వారినే ప్రజలు ఎన్నుకుంటారు.
చంద్రబాబు ద్రోహవిధానాల వల్లే తీవ్రంగా నష్టపోయాం:
- నాగార్జునసాగర్ కుడి కాల్వ నుంచి ప్రకాశం, గుంటూరు జిల్లాకు తాగునీటిని విడుదల చేశాం.
- ఈ వివాదంపై కేంద్ర ప్రభుత్వంతో కూడా చర్చలు జరుగుతున్నాయి.
- కానీ కొన్ని పత్రికలు, తెలుగుదేశం పార్టీ నేతలు ఇష్టానుసారం, ఆంధ్రప్రదేశ్‌కు ద్రోహం చేసేవిధంగా రాస్తున్నారు... మాట్లాడుతున్నారు.
- పవన్ కల్యాణ్, చంద్రబాబులు అసలు మాట్లాడటం లేదు.
- కృష్ణా జలాల విషయంలో రాష్ట్రం విభజన జరిగినప్పటి నుంచి తీవ్రమైన నష్టం జరిగింది.
- తెలంగాణా ఎక్కువ నీటిని వాడుకునే ప్రయత్నం చేసింది. ఆంధ్రప్రదేశ్ తన వాటా నీటిని వాడుకునే హక్కు లేకుండా చేసింది.
- దీని వల్ల తీవ్రంగా నష్టపోయిన మన రాష్ట్రం జగన్ గారి నాయకత్వంలో సాగర్ కుడి కాల్వను మన అధీనంలోకి తీసుకుని నీరిచ్చే స్వేచ్ఛను పొందాం.
- దీన్ని కనీసం చంద్రబాబు కానీ, వారి పత్రికలు కానీ మద్దతు ఇవ్వకపోతే సరే..రాతలు రోతలుగా రాస్తున్నారు.
- దండయాత్ర చేశామని, ఓట్ల రాజకీయం కోసమే ఇదంతా చేశామని రాస్తున్నారు.
- చాలా సీనియర్ నాయకుడని, అనుభవం ఉన్న వాడని చంద్రబాబును రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రిని చేశారు.
- ఆయన ముఖ్యమంత్రి కావడమే ఈ రాష్ట్రానికి శనిగా దాపురించింది.
- కృష్ణా జలలాల విషయంలో చంద్రబాబు అవలంభించిన ద్రోహవిధానాల వల్ల తీవ్రంగా నష్టపోయాం.
ఓటుకు నోటులో దొరికిపోయి కృష్ణా నీరు తెలంగాణ కాళ్ల దగ్గర పెట్టాడు:
- విభజన నేపథ్యంలో శ్రీశైలాన్ని మన అధీనంలో పెట్టారు. నాగార్జునసాగర్‌ను తెలంగాణ ఆధ్వర్యంలో పెట్టారు.
- అయితే కేఆర్‌ఎంబీ ఆనాడు ఈ రెండింటిని మేం అధీనంలోకి తీసుకుంటాం అని కోరింది.
- దీనికి ఏపీ అంగీకరించింది. కానీ తెలంగాణ అంగీకరించలేదు.
- వారు నీటిని ఎక్కువ వాడుకోవడానికి ప్రయత్నం చేశారు. దీనికి చంద్రబాబు అసమర్ధతే కారణం.
- వాస్తవానికి శ్రీశైలం ఎగువన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి మన రాష్ట్రం 30 టిఎంసీల నీటిని వాడుకునే హక్కు ఉంది.
- కానీ మన రాష్ట్రం ఈ ఏడాది వాడుకోలేకపోయింది. దీనికి కారణం తెలంగాణ పవర్ కోసం నీటిని విచ్చలవిడిగా కిందకు విడుదల చేశారు.
- దీని వల్ల శ్రీశైలంలో లెవల్ తగ్గింది. నీటి విడుదలను ఆపండని ఎంత చెప్పినా వారు వినలేదు.
- వాస్తవానికి శ్రీశైలం ప్రాజెక్టు మన అధీనంలోనిది అయినా ఎడమ వైపు అంతా తెలంగాణ చేతిలోకి వెళ్లింది.
- మాకు తాగునీటి కోసం, వ్యవసాయం కోసం నీరు కావాలి అంటే వినలేదు.
- నాగార్జునసాగర్ మొత్తం వారి చేతిలో ఉంది. కుడి కాల్వ తాళాలు వారి చేతుల్లోకి వెళ్లాయి.
- కుడి కాల్వ నుంచి నీటిని ఇవ్వాలంటే తెలంగాణ ప్రభుత్వం తాళాలు ఇవ్వాలి.
- నేడు పోలీసు యాక్షన్ చేసి మన భూభాగంలో మన తాళాలు మనం తీసుకున్నాం..
- రాష్ట్ర విభజన నుంచి ఇప్పటి వరకూ మన నీటిని మనం వాడుకోలేకపోవడానికి కారణం చంద్రబాబు అసమర్ధతే.
- చంద్రబాబు ఓటు నోటు కేసులో చిక్కి తెలంగాణకు తలవంచాడు.
- మన హక్కులను ఆనాడు చంద్రబాబు కాపాడలేకపోవడం వల్ల అతను ఆంధ్రా ద్రోహిగా మిగిలిపోయాడు.
ఇక్కడ ఇళ్లూ వాకిలీ లేనివారికి రాష్ట్ర ప్రయోజనాలు ఏం పడతాయి?:
- చంద్రబాబుకు ఇక్కడ పొలం లేదు..ఇళ్లు లేదు..ఇక్కడ ఇళ్లు వాకిలి లేని వారికి రాష్ట్ర ప్రయోజనాలపై ఏం బాధ్యత ఉంటుంది..?
- ఆయనకు ఆంధ్రరాష్ట్ర ప్రయోజనాలకంటే ఆయన సొంత ప్రయోజనాలే ముఖ్యం.
- ఇక ఈనాడు ప్రయోజనాలు వేరు...ఆంధ్రజ్యోతి ప్రయోజనాలు వేరు.
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దండయాత్ర చేసిందని రాసే సిగ్గుమాలిన పత్రికలను అడుగుతున్నా..అది దండయాత్ర ఎలా అవుతుంది.?
- మేం మా భూభాగంలోనే ఉన్నప్పుడు దండయాత్ర ఎలా అవుతుంది.
- ఈ దురదృష్ట కర పరిణామాలకు కారణం ఐదేళ్లు పరిపాలన చేసిన నారా చంద్రబాబునాయుడు.
- చంద్రబాబు రైతు ద్రోహిగా మారి వాటర్ మేనేజ్‌మెంట్ వారి చేతికి అప్పజెప్పి రాష్ట్రాన్ని దారుణమైన పరిస్థితిలోకి నెట్టాడు.
- సరైన సమయంలో పోలీసు యాక్షన్ చేసి మన హక్కులను మన స్వాధీనంలోకి తీసుకురావడంలో జగన్‌గారి నిర్ణయం ప్రశంసనీయం.
- అప్పటి ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమా కూడా అన్యాయం చేసి నేడు మాట్లాడుతున్నాడు.
- ఆనాడు పోలీసు యాక్షన్ 2015 ఫిబ్రవరి 12వ తేదీన చేశారు. ఆ తర్వాత గవర్నర్ వద్ద రాజీ పడి తాళాలు వాళ్ల చేతికి అప్పగించి వచ్చారు.
- మేం ఈ రోజు పోలీసు యాక్షన్‌కి వెళ్లి సమర్ధంగా మన కాల్వలను స్వాధీనం చేసుకుని నీరిచ్చాం.
- మాకు నీటి కోసం ఇండెంట్ ఇవ్వలేదని కేఆర్‌ఎంబీ అభ్యంతరం తెలిపిందని పచ్చ పత్రికలు రాతలు రాశాయి.
- నీరు ఎప్పుడు అవసరమో మనం నిర్ణయించుకుంటాం. ఇది మా స్వాధీనంలో ఉంది అని చెప్పడానికే మేం నేడు నీటిని వదిలాం.
- గతంలో ఇండెంట్ ఇచ్చిన సందర్భంలోనూ వారు నీటిని విడుదల చేయలేదు.
- శ్రీశైలంలో ఇండెంట్ లేకుండా ఇష్టారీతిన పవర్ జనరేషన్ పేరుతో నీటిని వాడుకున్నారు. కిందికి వదిలేశారు.
- ఫలితంగా మనకు రావాల్సిన 30 టీఎంసీల నీరు మనకు అందలేదు. మనం కేవలం 13 టీఎంసీలే వాడుకోవాల్సిన దుస్థితి ఎదురైంది.
- కారణం శ్రీశైలంలో కావాల్సిన నీటిమట్టం లేదు..నీటిని పవర్ జనరేషన్ కోసం కిందికి విడుదల చేశారు.
- మొన్న మాజీ మంత్రి మాట్లాడుతూ వాళ్లు పంటలకు నీళ్లిస్తున్నారు అన్నాడు. నిజమే మీరు తాళాలు వాళ్ల చేతిలో పెట్టాక ఇక నీరిచ్చుకోక ఏం చేస్తారు..?
- చంద్రబాబు అసమర్ధత వల్ల తాళాలు వాళ్ల దగ్గర ఉన్నాయి..
- దీన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి రాతలు రాస్తున్నారు.
- ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు తెలంగాణ పక్షపాతంగా రాతలు రాస్తున్నారు.
- నిజంగా తెలంగాణలో ఉన్న లాజికల్‌గా ఆలోచించే వారు కూడా ఏపీ చేసింది కరెక్ట్ అనే పరిస్థితి ఉంది.
- కానీ జగన్ గారిపై బురద జల్లాలనే ప్రయత్నించే ఆ పత్రికలు దుర్మార్గపు రాతలు రాస్తున్నారు.
- చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ నీటి హక్కులను తెలంగాణ పాదాకృతం చేశాడు.
- దాన్ని సరిచేసిన వ్యక్తి శ్రీ జగన్మోహన్‌రెడ్డి. చిత్తశుద్ధిగా మన వాటాను రాబట్టుకోడానికి ప్రయత్నం చేశాం.
- మేం ఎవ్వరికీ ద్రోహం చేయలేదు. ద్రోహం చేసిందల్లా చంద్రబాబే.
సున్నితమైన సమస్యకు సరైన సమయంలో సరైన యాక్షన్:
- ఇదే పని ఈ నాలుగేళ్లు చేయలేదే అంటే నిజమే. సమయం కోసం మేం వేచి చూసి సరైన సమయంలో చేశాం.
- మీరు గతంలో పోలీసు యాక్షన్ చేశారు కానీ రాజీ పడి వచ్చారు.
- సున్నితమైన సమస్యను సమయం చూసి పరిష్కరించుకునే దిశగా చర్యలు చేపట్టాం.
- మీరు వెళ్లినప్పుడు యుద్ధం చేశారు..విఫలమయ్యారు...మేం యుద్ధం లేకుండానే సరైన సమయంలో మన హక్కులను కాపాడున్నాం.
- ఇప్పుడు మన ప్రాంతం మన స్వాధీనంలో ఉంది..వారి ప్రాంతం వారి స్వాధీనంలో ఉంది.
- కానీ చంద్రబాబు హయాంలో ఇలా ఎందుకు లేదంటే ఆయన ద్రోహం చేశాడు కాబట్టి.
- చంద్రబాబు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.
- పవన్ కల్యాణ్ కూడా దీనిపై సమాధానం చెప్పాలి.
మన భూభాగంలోకి మనం వెళ్తే దండయాత్ర ఏంటి..?:
- పురందేశ్వరి ఎందుకలా స్పందించారో నాకర్ధం కావడం లేదు.
- మన భూభాగంలోకి మనం వెళ్తే దండయాత్ర ఏంటి..?
- ఈనాడు, ఆంధ్రజ్యోతికి బుద్ధిలేదు...పురందేశ్వరికీ బుద్ధి లేదు.
- పేరుకు బీజేపీ అధ్యక్షురాలు అట..కానీ ఆమెకు చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలట. జగన్ గారు ఓడిపోవాలట.
- సాగర్ విషయంలో మనం చేసిన యాక్షన్ నూటికి నూరుపాళ్లు న్యాయమైనది..ధర్మమైనది.
- అది మన హక్కు...కాదనే శక్తి కేంద్రానికే కాదు..మరెవ్వరికీ లేదు.
- మనకు ఉన్న వాటా మనం తీసుకోవాలా లేదా..? 66 శాతం వాటా మనది...ఆ వాటా మనం తప్పకుండా తీసుకుంటాం.
- కేసీఆర్‌ని గెలిపించడం కోసం ఈ చర్య అని కొందరు అంటున్నారు.
- ఎవరికి ప్రజా బలం ఉంటే వారు గెలుస్తారు. మన యాక్షన్ దేన్నీ ప్రభావితం చేయదు.
- ఇప్పుడు కేంద్రం స్వాధీనం చేసుకుంటాను అన్నది. గతంలో తెలంగాణ ఒప్పుకోలేదు. వాళ్లు నీళ్లు వదిలితే మనం తీసుకోవాల్సి వచ్చేది.
- ఇప్పుడు కేంద్రాన్నే నీళ్లు అడుగుతాం. మన వాటా మనం తీసుకుంటాం.
- నాలుగేళ్లు లేనిది ఇప్పుడే ఎందుకంటే అదే వ్యూహం.
- ఒక సారి యాక్షన్ కి వెళ్లాడు చంద్రబాబు..విఫలమయ్యాడు.
- రెండో సారి సక్సెస్ అవ్వాలనే మేం వ్యూహాత్మకంగా వ్యవహరించి సక్సెస్ అయ్యాం.
- మేం చెయ్యలేని పని జగన్‌గారు చేశారని వాళ్ల కుళ్లుమోతు తనం.
- మా వల్ల కానిది జగన్‌గారి వల్ల అయిందనే బాధ, ఏడుపు తప్ప మరేమీ లేదు.
పక్క రాష్ట్రంలో ఏ పార్టీ వస్తే మాకేంటి..?:
- పక్కరాష్ట్రంలో ఏ పార్టీ వస్తే మాకేంటి..? అక్కడేమొస్తుందో నాకు ఎలా తెలుస్తుంది..?
- కానీ కాంగ్రెస్ వస్తుందని టీడీపీ వారు చంకలు గుద్దుకుంటున్నారు.
- వీరికి చిత్తశుద్ధి ఉంటే తమ పార్ట్‌నర్ పవన్ కళ్యాణ్ నిలబడ్డ 8 సీట్లు గెలవాలని కోరుకోవాలి. కానీ కాంగ్రెస్ కోసం తాపత్రయ పడుతున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఒకటే.
- నక్క చంద్రబాబు ఎవరికి సపోర్ట్ చేస్తున్నాడో చెప్పలేదే..?
- గోడమీద పిల్లలా ఉండి..ఎవరు గెలిస్తే వారి సంకనెక్కాలని ఉన్నాడు.
- కాకపోతే ఆయన సామాజికవర్గానికి చెందిన కులసంఘాలు మాత్రం కాంగ్రెస్‌కు మద్దతు అని చెప్పాయి.
- ఆ పచ్చ జెండాలేదో పవన్ కల్యాణ్ పక్కన ఎత్తాలి కదా..? మొన్న మా బాబును లోపలేస్తే పలకరించి వెళ్లాడు..మద్దతు పలకాలి అని వారు అనుకోవడం లేదు.
- మా పవన్ కల్యాణ్‌కు ఎలాగూ సిగ్గులేదు...కనీసం మీరన్నా పచ్చ జెండాలు అతని కోసం, అతని అభ్యర్థుల కోసం ఎత్తాలి కదా.
- కూకట్ పల్లిలో వీళ్లు ఏం చేశారో తెలుసుకోండి. టీడీపీ వాళ్లు కాంగ్రెస్ గెలుపు కోసం ఓట్లు కొనుగోలు చేశారు.
- పవన్ కల్యాణ్ గ్లాసు పగలగొట్టాలని చూశారు..అయినా పవన్‌కి సిగ్గులేదు.