కోటంరెడ్డి నమ్మకద్రోహి
15 Mar, 2023 09:33 IST
అమరావతి: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నమ్మకద్రోహి అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. రెండో రోజు అసెంబ్లీ సమావేశంలో కోటంరెడ్డి సభను అడ్డుకునేందుకే ప్రయత్నించారు. కోటంరెడ్డి తీరును మంత్రి అంబటి రాంబాబు తప్పుపట్టారు. శ్రీధర్‌రెడ్డిపై టీడీపీకి ఇప్పుడు ప్రేమ వచ్చిందా?. కోటంరెడ్డి నమ్మకద్రోహి.. చంద్రబాబు, టీడీపీ కోసం ఆయన పని చేస్తున్నారని అంబటి దుయ్యబట్టారు.