సత్తెనపల్లి ఘటనపై రాజకీయాలు చేయవద్దు
పల్నాడు: పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఘటనపై రాజకీయాలు చేయవద్దని ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు. సత్తెనపల్లి మండలం రామకృష్ణ పురం బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో 100 మంది బాలికలు తీవ్ర అస్వస్థత గురైయ్యారు. వెంటనే ప్రభుత్వం స్పందించి వారికి మెరుగైన వైద్యం అందిస్తోంది. ఈ ఘటనపై సీఎంవో ప్రత్యేక దృష్టి పెట్టింది.
విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ..ఒక్క సారిగా ఇంత మంది ఎందుకు అనారోగ్యం పాలయ్యారు అని దర్యాప్తు చేస్తున్నామన్నారు. పిల్లల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. రెండు వందల మంది విద్యార్థినులు అనారోగ్యం పాలైన ఘటనలో ఎవరిని ఉపేక్షించం అన్నారు. ఎవరిని కాపాడాల్సిన అవసరం మాకు లేదు…పిల్లల ఆరోగ్యాన్ని కాపాడటం ప్రస్తుతం మా మొదటి కర్తవ్యం అన్నారు. తల్లి దండ్రులు ఎవరు భయ పడాల్సిన అవసరం లేదన్నారు.