టీడీపీ ఎమ్మెల్సీల తీరు సిగ్గుచేటు
18 Mar, 2023 12:49 IST
అమరావతి: శాసనమండలిలో టీడీపీ ఎమ్మెల్సీల తీరు సిగ్గుచేటు అని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. శనివారం మండలిలో టీడీపీ సభ్యుల ఆందోళనపై మంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. 24వ తేదీలోపు ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఢిల్లీ పర్యటనపై స్పందిస్తారని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. రాష్ట్రానికి సంబంధించి అనేక అంశాలపై చర్చించేందుకు సీఎం ఢిల్లీ వెళ్లారని చెప్పారు. సభకు అంతరాయం కలిగించే విధంగా టీడీపీ ఎమ్మెల్సీలు చేయడం సిగ్గుచేటు అని ధ్వజమెత్తారు. చంద్రబాబు డైరెక్షన్లోనే టీడీపీ ఎమ్మెల్సీలు మాట్లాడుతున్నారని విమర్శించారు.