పోలవరంలో వరద పరిస్థితిని పరిశీలించిన మంత్రి అంబటి

11 Jul, 2022 17:09 IST

ప‌శ్చిమ గోదావ‌రి:  పోలవరం ప్రాజెక్టు వద్ద వరద పరిస్థితిని ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు సోమవారం పరిశీలించారు. కాపర్ డ్యాం వద్ద వరద పరిస్థితిని ఇరిగేషన్ అధికారులు మంత్రి కి వివరించారు. స్పీల్ వే వద్ద నీటి మట్టం 33 మీటర్ల కు చేరుకోవడంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు మంత్రి సూచించారు. వరద ఉధృతిని ఎప్పటికప్పుడు మంత్రి పర్య‌వేక్షిస్తున్నారు. వ‌ర‌ద ప‌రిస్థితిపై అధికారుల‌తో మంత్రి స‌మీక్ష నిర్వ‌హించారు.