నిత్యావసర వస్తువులు అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు

25 Mar, 2020 13:58 IST

తాడేపల్లి: నిత్యావసర వస్తువులు అధిక ధరలకు ధరలకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని, ఎక్కడైనా ఎక్కువ ధరలకు విక్రయిస్తే టోల్‌ఫ్రీ నంబర్‌ 1902 కాల్‌ చేసి ఫిర్యాదు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సూచించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం ఆవరణలో మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ.. రైతు బజార్ల వికేంద్రీకరణకు సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశాలిచ్చారని, ఖాళీ ప్రదేశాల్లో 2, 3 కిలోమీటర్లలో రైతు బజార్ల ఏర్పాటుకు నిర్ణయించామన్నారు.  నిత్యావసర షాపులు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తెరిచి ఉంచాలని నిర్ణయించామన్నారు. నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు ప్రజలంతా సోషల్‌ డిస్టెన్స్‌ పాటించాలని కోరారు. నిత్యావసర వస్తువులు ఎక్కువ ధరలకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిత్యావసర వస్తువుల కోసమని రెండు, మూడుసార్లు బయటకు రావొద్దని కోరారు. ఒక వాహనంపై ఒకరే ప్రయాణించాలని, గుంపులు గుంపులుగా ఉండొద్దని, ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని విజ్ఞప్తి చేశారు.