కమీషన్ల కోసం పోలవరాన్ని నిర్లక్ష్యం చేశారు
19 Jun, 2019 18:06 IST
పశ్చిమ గోదావరి : కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్టును టీడీపీ పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మంతరి ఆళ్ల నాని మండిపడ్డారు. గురువారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టులో ఏం జరుగుతుందో తెలియకుండా గత టీడీపీ ప్రభుత్వం జనాన్ని మభ్య పెట్టిందని అన్నారు.. ముఖ్యమంత్రి రేపు ప్రాజెక్టును సందర్శించి ఇక్కడి పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు.