పేదవారి సొంతింటి కలను నిజం చేస్తున్నాం
ప్రకాశం: పేదవారి సొంతింటి కలను ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిజం చేస్తున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. జిల్లాలో నిర్వహించిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అర్హులైన వారందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నామని ఆదిమూలపు సురేష్ చెప్పారు. పేదలకు ఇళ్ల స్థలాలు అందకుండా టీడీపీ కుట్రలు చేసిందని, చంద్రబాబు తన అనుచరులతో కోర్టులో కేసులు వేయించారన్నారని చెప్పారు. అడ్డంకులు తొలగించుకుంటూ పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. లబ్ధిదారులు తమకు ఇష్టం వచ్చిన రీతిలో ఇంటి నిర్మాణాన్ని చేపట్టవచ్చు అని, ప్రభుత్వం ఇచ్చిన మూడు ఆప్షన్లలో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవచ్చు అన్నారు. వైయస్ఆర్ జగనన్న కాలనీల్లో అన్ని రకాల మౌలిక వసతులు ప్రభుత్వమే కల్పిస్తుందని మంత్రి సురేష్ వెల్లడించారు.