దార్శనికుడు సీఎం వైయస్ జగన్
నెల్లూరు: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి దార్శనికుడు, సంఘ సంస్కర్త అని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. జగనన్న అమ్మ ఒడి కార్యక్రమం ప్రారంభోత్సవ సభలో మంత్రి మాట్లాడారు. ఈ రోజు చారిత్రాత్మక దినం. ఎన్నో అరిష్టాలు, అడ్డంకులు, కుయుక్తులు, కుట్రలు చేధించుకొని ఈ కార్యక్రమాన్ని మొదలుపెడుతున్న శుభ దినం. స్వాతంత్య్ర భారత దేశ చరిత్రలో ఎక్కడా కూడా ఇన్ని సంస్కరణలు ఎక్కడా చేయలేదు. వైయస్ జగన్ పాదయాత్రలో తల్లులు, పిల్లలు చదువుల విషయంలో పడుతున్న ఇబ్బందులు గమనించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చరిత్ర చూస్తే..టార్చ్బేరర్లు జ్యోతిరావు పూలే, అంబేద్కర్లు చదువు కోసం కృషి చేశారు. విద్యను అందరికి అందించే విధంగా వైయస్ జగన్ ఆలోచన చేసి ఈ కార్యక్రమాలను మొదలుపెట్టారు.అభినవ అంబేద్కర్గా సీఎం వైయస్ జగన్ నిలిచారు. దళిత సామాజిక వ్యక్తిని విద్యాశాఖ మంత్రిగా నియమించారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన వైయస్ జగన్కు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నెమలి పించం మీరే జగనన్న అంటూ కొనియాడారు. రాష్ట్రంలోని చిన్నారులందరూ నెమలి పించంగా వైయస్ జగన్ ఫొటోలను తమ పుస్తకాలను దాచిపెట్టుకుంటున్నారు. దార్శనికుడు, సంఘ సంస్కర్తగా వైయస్ జగన్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు.