ఈ నెల 18 నుంచి ఇంటర్ తరగతులు
తాడేపల్లి: ఈ నెల 18వ తేదీ నుంచి ఇంటర్ మీడియట్ విద్యార్థులకు తరగతులు ప్రారంభిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తరగతులు నిర్వహించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఈ ఏడాది ఆఫ్‌లైన్‌లోనే ఇంటర్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నామన్నారు.వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్ అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు. ఈ ఏడాది పాత పద్ధతిలోనే ఇంటర్ అడ్మిషన్లు ఉంటాయని స్పష్టం చేశారు. కాలేజీల్లో కచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. ఫీజులు కూడా ఆన్‌లైన్‌లో కట్టే వెసులుబాటు కల్పిస్తున్నామన్నారు. కార్పొరేట్ కాలేజీల దోపిడీకి అడ్డుకట్ట వేస్తున్నామని చెప్పారు. ఇంటర్ ప్రాక్టికల్స్ యధాతథంగా ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు.