దూరదర్శన్‌లో ఆన్‌లైన్ పాఠాలు
14 Apr, 2020 12:39 IST
తాడేపల్లి: లాక్‌డౌన్ నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు ప్రకటించినందున పదో తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠాలను బోధించడానికి ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. లాక్‌డౌన్ అనంతరం విద్యార్థులకు ముందుగా ప్రిపరేషన్‌కు సమయం ఇచ్చి పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. కరోనా నేపథ్యంలోదూరదర్శన్, సప్తగిరి ఛానల్‌లో ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి 11 గంటలు వరకు సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఈ తరగతులు ఉంటాయని. విద్యారులు ఇళ్ల వద్దనే ఉండి చదువుకోవాలని సూచించారు.