విలువలతో కూడిన విద్యను అందించడమే లక్ష్యం

18 Jun, 2019 11:53 IST

వెలగపూడి: గుణాత్మకమైన విలువలతో కూడిన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. శాసనమండలిలో మంత్రి సురేష్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు పెంచి అవసరం మేరకు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఇంగ్లిష్‌ మీడియాన్ని తీసుకొచ్చి మాతృభాష తెలుగుకు తగిన ప్రాధాన్యం ఇస్తామన్నారు. మధ్యాహ్న భోజన పథకంపై ప్రధాన దృష్టి పెట్టడం జరిగిందన్నారు. ప్రైవేట్‌ విద్యాసంస్థలపై ప్రభుత్వానికి స్పష్టమైన వైఖరి ఉందన్నారు. అమ్మ ఒడి పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు.