సీఎం వైయస్ జగన్ స్ఫూర్తి
20 Apr, 2022 11:30 IST
అనంతపురం: ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాబోయే రోజుల్లో జీతం తీసుకోకుండా పనిచేయనున్నట్లు వెల్లడించారు. ఏప్రిల్ నుంచి తన వేతనం రూ.65వేలు, ఇతర అలవెన్సులు ఇవ్వొద్దంటూ ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యంకు ఆయన లేఖ రాశారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి స్ఫూర్తితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెట్టు గోవిందరెడ్డి తెలిపారు.