నూతన బాధ్యతలు చేపట్టిన మంత్రి గౌతమ్‌రెడ్డి

28 Jan, 2020 11:55 IST

తాడేపల్లి: రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి నూతన బాధ్యతలు చేపట్టారు. ఇటీవలే మంత్రి గౌతమ్‌రెడ్డికి స్కిల్‌ డెవలప్‌మెంట్, ట్రైనింగ్‌ శాఖను ప్రభుత్వం కేటాయించింది. మంగళవారం తాడేపల్లిలోని స్కిల్‌డెవలప్‌మెంట్‌ సెంటర్‌ చేరుకున్న మంత్రి గౌతమ్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన అనంతరం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.