వైయస్ఆర్ సీపీ మేయర్ అభ్యర్థులు ఖరారు..
అమరావతి: రాష్ట్రంలో 11 నగరపాలక సంస్థలు, 75 మునిసిపాలిటీల్లో కొత్త పాలక మండళ్లు ఇవాళ కొలువుదీరనున్నాయి. కార్పొరేషన్లకు మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మునిసిపాలిటీలకు చైర్‌పర్సన్లు, వైస్ చైర్‌పర్సన్ల పదవులకు అభ్యర్థులను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత , ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎంపిక చేస్తూ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల అయ్యింది. ఈ నెల 10న 12 మునిసిపల్ కార్పొరేషన్లు, 75 మునిసిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఏలూరు కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు చేపట్టలేదు. ఫలితాలు ప్రకటించిన 11 కార్పొరేషన్లలో ఎన్నికైన కార్పొరేటర్లు మేయర్, డిప్యూటీ మేయర్‌లను ఎన్నుకుంటారు.
ప్రమాణ స్వీకారం ప్రారంభం..
రాష్ట్రంలోని 75 మునిసిపాలిటీలకు ఎన్నికైన కౌన్సిలర్లు చైర్‌పర్సన్లు, వైస్ చైర్‌పర్సన్లను ఎన్నుకుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11 నగరపాలక సంస్థలు, 75 మునిసిపాలిటీల్లో కొత్త పాలక మండళ్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభమైంది. కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో అధికారులు ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు. అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్, ఛైర్మన్, వైస్‌ఛైర్మన్ల ఎన్నిక నిర్వహించనున్నారు.
వైయస్ఆర్ సీపీ మేయర్ అభ్యర్థులు..
విశాఖ మేయర్‌గా గొలగాని హరి వెంకటకుమారి
►విశాఖ డిప్యూటీ మేయర్‌గా జియ్యాని శ్రీధర్
►విశాఖ: యలమంచిలి మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా పిల్లా రామకుమారి
►యలమంచిలి మున్సిపాలిటీ వైస్‌ఛైర్మన్‌గా వెంకట గోవిందరాజు
►అనంతపురం: హిందూపురం మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా ఇంద్రజ
►హిందూపురం మున్సిపాలిటీ వైస్‌ఛైర్మన్‌గా పీఎన్ జాబివుల్లా
►ప.గో: జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా బత్తిన లక్ష్మీ
►జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ వైస్‌ఛైర్‌పర్సన్‌గా కంచర్ల వాసవీ
►విజయనగరం: పార్వతీపురం మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా గోను గౌరీశ్వరి
►పార్వతీపురం మున్సిపాలిటీ వైస్ ఛైర్‌పర్సన్‌గా కొండపల్లి రుక్మిణి
►తూ.గో: ఏలేశ్వరం మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా అలమండ సత్యవతి
►ఏలేశ్వరం మున్సిపాలిటీ వైస్‌ఛైర్‌పర్సన్‌గా శిడగం త్రివేణి