ఎన్టీఆర్ జిల్లాలో ఘనంగా మే డే వేడుకలు
విజయవాడ: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు పునూరు గౌతమ్ రెడ్డి పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కార్మిక సోదరులతో కలిసి కేక్ కట్ చేసి వారికి మే డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో కార్మికుల పాత్ర అపారమని కొనియాడారు. కష్టజీవుల శ్రమ వల్లే దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమం కోసం వైయస్ జగన్ గారు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటారని, వారి హక్కులు, భద్రత కోసం వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేసిందని వివరించారు. ఈ కార్యక్రమంలో కార్మిక సోదరులు, పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, డివిజన్, మండల స్థాయి నాయకులు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, మహిళా నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. కార్యక్రమం ఉత్సాహభరితంగా కొనసాగింది.