చిత్తశుద్ధితో బాధ్యతలు నిర్వహిస్తా..
9 Jun, 2019 20:57 IST
కొవ్వూరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనపై పెట్టిన బాధ్యత, నమ్మకాన్ని వమ్ము చేయనని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత తెలిపారు. అంతటి బాధ్యతలు తనకు ఇచ్చిన ముఖ్యమంత్రికి ఆమె ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం ఆమె కొవ్వూరులో మాట్లాడుతూ.. మహిళలకు, శిశువులకు సేవ చేసుకోవడం ఓ మహిళగా తన అదృష్టమన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి కొవ్వూరు నియోజకవర్గ నాయకులు మంత్రిని కలిసి అభినందనలు తెలిపారు.