2024లోనూ జగనన్న వన్స్ మోర్ అంటున్నారు
11 Apr, 2023 14:16 IST
చిత్తూరు: 2024 లో జగనన్నను వన్స్ మోర్ అంటూ ప్రజలు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారని మంత్రి ఆర్కే రోజా తెలిపారు. జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ఇంటింటా పర్యటించి మా నమ్మకం నువ్వే జగనన్న స్టిక్కర్లను అంటించారు. ప్రజలతో మాట్లాడి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై ఆరా తీశారు. గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి ఉన్న తేడాను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన 16 మంది ముఖ్యమంత్రు ల కన్నా మిన్నగా వైయస్ జగన్ పాలిస్తున్నాడని పేర్కొన్నారు. అలాంటి ముఖ్యమంత్రిపై నీతిమాలిన రాజకీయాలు చేయాలని చూస్తే టిడిపి ,జనసేన లను తరిమి తరిమి కొడతారని హెచ్చరించారు.