30న ర్యాలీని విజయవంతం చేద్దాం
గుంటూరు జిల్లా : మైనారిటీ వర్గాల సమస్యలు, హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో అవగాహన కల్పించే దిశగా ఈ నెల 30వ తేదీ తలపెట్టిన ర్యాలీని విజయవంతం చేయాలని గుంటూరు నగర వైయస్ఆర్‌సీపీ అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ షేక్ నూరి ఫాతిమా పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక కార్యాలయంలో పార్టీ మైనారిటీ విభాగం నేతలతో ఆమె సమావేశమై ర్యాలీకి పెద్ద ఎత్తున మైనారిటీ వర్గాల ప్రజలు, పార్టీ శ్రేణులు హాజరయ్యేలా సమన్వయంతో పనిచేయాలని నాయకులకు సూచించారు. ర్యాలీని విజయవంతం చేయాలనే దృఢ సంకల్పాన్ని మైనారిటీ విభాగ నాయకులు వ్యక్తం చేశారు. 30వ తేదీ ఉదయం నగరంపాలెం ఈద్గా నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఎమ్మెల్సీ చంద్రగిరి యేసు రత్నం మాట్లాడుతూ, మైనారిటీ వర్గాల సంక్షేమం, భద్రత, హక్కుల పరిరక్షణకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో తమ గళాన్ని బలంగా వినిపించేందుకు ర్యాలీలు, ఉద్యమాలు అవసరమని పేర్కొన్నారు. సమావేశంలో గుంటూరు జిల్లా మైనారిటీ అధ్యక్షులు షైదా ఖాన్, పశ్చిమ నియోజకవర్గం మైనారిటీ అధ్యక్షులు ఖాసీం బేగ్ , జిల్లా మైనారిటీ విభాగం సెక్రటరీ షర్ఫుద్దీన్, మంగళగిరి నియోజకవర్గం నుంచి సలాం , సుభాని , పొన్నూరు నియోజకవర్గం నుంచి మౌలాలి , జాని , మేడికొండూర్ నుంచి ఇమామ్ సయాబ్ , రబ్బానీ , జాని , ఫిరోజ్ ఖాన్ , ఫిరంగిపురం మండలం నుంచి మస్తాన్ వలి గారు, గుంటూరు తూర్పు & పశ్చిమ నియోజకవర్గాల డివిజన్ మైనారిటీ అధ్యక్షులు, మైనారిటీ ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.