సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసిన లేళ్ల అప్పిరెడ్డి
15 Jun, 2021 12:29 IST
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైన సందర్భంగా లేళ్ల అప్పిరెడ్డి వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ఈ సందర్భంగా లేళ్ల అప్పిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ రాతంశెట్టి రామాంజనేయులు పాల్గొన్నారు.