`నాడు-నేడు`కు లారస్‌ ల్యాబ్స్‌ రూ.4 కోట్లు విరాళం

9 Jan, 2023 17:50 IST

తాడేప‌ల్లి: రాష్ట్రంలోని విద్యా మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి వైయ‌స్ జ‌గ‌న్ ప్రభుత్వం చేపట్టిన ‘నాడు – నేడు‘ కార్యక్రమానికి లార‌స్ ల్యాబ్స్ లిమిటెడ్‌, ప్రముఖ పరిశోధన ఆధారిత ఫార్మాస్యూటికల్‌ తయారీ మరియు బయోటెక్‌ కంపెనీ లారస్‌ ల్యాబ్స్‌ రూ. 4 కోట్ల విరాళం అందించింది. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ను లార‌స్ ల్యాబ్స్ వ్య‌వ‌స్థాప‌కుడు, సీఈవో డాక్ట‌ర్ స‌త్య‌నారాయ‌ణ చావా మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ప్రభుత్వం చేపట్టిన ‘నాడు – నేడు‘ కార్యక్రమానికి రూ. 4 కోట్ల విరాళం అందజేశారు. అంతేకాకుండా పారిశ్రామిక ప్రాంతమైన అనకాపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక అధునాతనమైన మరియు అన్ని అత్యాధునిక సౌకర్యాలతో కూడిన కాలిన గాయాలకు సంబంధించి ఒక ప్రత్యేక వార్డు నిర్మాణానికి కూడా 5 కోట్ల రూపాయలు అందిస్తామని కంపెనీ వ్యవస్థాపకుడు మరియు సి.ఈ.ఓ డా. సత్యనారాయణ చావా, సీఎంకు వివ‌రించారు. ఈ మేర‌కు రూ. 4 కోట్ల రూపాయల విరాళ పత్రాలను సీఎంకు అందజేశారు. నాడు – నేడు పథకం క్రింద లారస్‌ ల్యాబ్స్‌ ఈ విరాళాన్ని అందించడం ఇది మూడవసారి.

ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన వారిలో లార‌స్‌ ల్యాబ్స్‌ వ్యవస్థాపకుడు, సీఈవో డాక్ట‌ర్‌. సత్యనారాయణ చావా, కార్పొరేట్‌ డెవలప్‌మెంట్, సింథసిస్‌, ఇంగ్రిడియంట్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కృష్ణచైతన్య చావా, మానవ వనరుల సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ నరసింహారావు చావా, సీఎస్‌ఆర్‌ హెడ్‌ సౌమ్య చావా ఉన్నారు.