అందుకే ఇవాళ ప్రజలు చంద్రబాబుపై చెప్పులు వేస్తున్నారు
అమరావతి: చంద్రబాబు అవినీతి పరుడు, స్వార్థపరుడని.. సొంత మామకే వెన్నుపోటు పొడిచి చెప్పులు వేయించారని మండిపడ్డారు. ఇవాళ ప్రజలే చంద్రబాబుపై చెప్పులు వేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి పేర్కొన్నారు.శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. విశాఖపై ఎల్లోమీడియాతో చంద్రబాబు దుష్ప్రచారం చేయించారని ధ్వజమెత్తారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ను చంద్రబాబు అడ్డుకున్నారని.. అందుకే విశాఖ ప్రజలు ఆయనను అడ్డుకున్నారని తెలిపారు. ఉత్తరాంధ్ర, రాయలసీమకు చంద్రబాబు అన్యాయం చేశారని విమర్శించారు. చంద్రబాబు స్క్రిప్టునే కాంగ్రెస్ నేతలు చదువుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే ఎంపీ నందిగం సురేష్‌పై దాడి చేశారని మండిపడ్డారు. అమరావతి రైతులను మోసం చేసింది చంద్రబాబేనని.. అమరావతి రైతులకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి న్యాయం చేస్తున్నారని తెలిపారు. రైతుల సంక్షేమానికి సీఎం వైయస్ జగన్ అనేక పథకాలు తీసుకొచ్చారని చెప్పారు.