చంద్రబాబుది ‘డెయిరీ మాఫియా’
తాడేపల్లి: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి అంటే భయం లేకుండా కూటమి ప్రభుత్వం అసెంబ్లీని అబద్ధాలకు వేదికగా మార్చుకుందని మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య( నాని) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తిరుమల లడ్డూ నెయ్యి అంశంపై ప్రభుత్వం చేసిన చర్చ అంతా వైయస్ జగన్ పై రాజకీయంగా బురదజల్లడానికేనని ఆయన స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... హెరిటేజ్ - ఇందాపూర్ డెయిరీల మధ్య ఉన్న అక్రమ సంబంధాలను కప్పిపుచ్చడానికే ఐదు రోజులు తాత్సారం చేసి, ఇవాళ లడ్డూ వివాదాన్ని తెరపైకి తెచ్చారని స్పష్టం చేశారు. గతంలో లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని గగ్గోలు పెట్టిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. ఇవాళ అసెంబ్లీలో మాత్రం ‘కల్తీ జరిగింది’ అంటూ మాట మార్చడం వారి ద్వంద్వ నీతికి నిదర్శనమని మండిపడ్డారు. 2014-19 మధ్య విజయవాడ నడిబొడ్డున ఎన్నో ప్రాచీన ఆలయాలను జేసీబీలతో కూల్చిన చరిత్ర చంద్రబాబుది అయితే... బాబు కూల్చిన ఆలయాలను వైయస్ జగన్ ప్రభుత్వం అత్యంత భక్తిశ్రద్ధలతో పునర్నిర్మించిందని.. అంతర్వేది రథం, రామతీర్థం ఆలయాలే అందుకు సాక్ష్యమని తెలిపారు. శ్రీవాణి ట్రస్ట్‌ను రద్దు చేస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. ఆర్టీసీ టిక్కెట్ల వెనుక జెరూసలెం, మక్కా యాత్రల ముద్రణకు జీవో ఇచ్చింది 2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వమేనని ఆధారాలతో సహా తేల్చి చెప్పారు. ఇప్పుడు దాన్ని వైయస్ జగన్ కి అంటగట్టడం నీచమైన రాజకీయమని మండిపడ్డారు. నిజంగా చంద్రబాబుకు దేవుడిపై భక్తి ఉంటే.. 2014 నుంచి ఇప్పటివరకు సరఫరా అయిన నెయ్యి కంపెనీల మూలాలపై సీబీఐ విచారణ జరిపించాలని పేర్ని నాని సవాల్ విసిరారు.
ప్రెస్‌మీట్‌లో పేర్నినాని ఇంకా ఏమన్నారంటే..
● మతాన్ని రాజకీయ ఆయుధంగా వాడుతున్నారు:
ఐదు రోజులుగా వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు హెరిటేజ్ డెయిరీ–ఇందాపూర్ డెయిరీ మధ్య ఉన్న సంబంధాలు, అక్రమ వ్యవహారాలపై చర్చిద్దామని పట్టుబడుతుంటే ప్రభుత్వం తాత్సారం చేసింది. చివరకు ఇవాళ అసెంబ్లీలో చర్చిద్దామని నిర్ణయం తీసుకుని, 10 మంది ఎమ్మెల్యేలతో రాజకీయాలు, అసత్యాలు మాట్లాడించింది. కలియుగ వెంకటేశ్వరస్వామి గురించి మాట్లాడుతున్నామనే భయం కూడా లేకుండా ఎమ్మెల్యేలతో బరితెగించి మాట్లాడించారు. మతాన్ని రాజకీయ ఆయుధంగా వాడుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం నారా చంద్రబాబు నాయుడు ఒక రిపోర్టులోని అంశాలను తప్పుగా అర్థం చేసుకుని, దురుద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేశారు. తిరుమల లడ్డూ తయారీ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారంటూ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కాషాయ బట్టలు కట్టుకుని గుడి మెట్లు కడిగారు. ఎద్దు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిపారని అన్నారు. కానీ ఇవాళ అసెంబ్లీలో మాట్లాడుతూ ‘మాజీ ముఖ్యమంత్రి కలిపారని నేను అనలేదు, టీటీడీ ఉద్యోగులు కలిపారని అన్నాను’ అంటూ మాట మార్చారు.”
హిందుమతం, కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి అన్న భయం లేకుండా కూటమి నేతలు అసెంబ్లీలో ఇవాళ బరితెగించి మాట్లాడారు. జేబులు కొట్టే దొంగలు ఉంటారు. ఎర వేసి వస్తువులు దోచుకునే వారు ఉంటారు. కానీ ఇంట్లో అందరం ఉండగానే తుపాకులు, కత్తులతో దోచుకునే వారు ఉంటారు. ఇవాళ మాట్లాడిన నాయకులు ఆ చివరి జాతికి చెందినవాళ్లు కాదా?. నారా లోకేష్ మొదట పంది కొవ్వు కలిపారని అన్నారు. ఇప్పుడు కల్తీ జరిగిందని మాట్లాడుతున్నారు. 35వ పేజీలో ఉందని నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నారు. సీబీఐ చార్జ్‌షీట్‌లో పామాయిల్ వంటి నూనె కల్తీ అయినట్లు మాత్రమే అభియోగాలు ఉన్నాయి.
● అక్కసుతోనే బాబు మతం పేరుతో మంటలు..
నారా చంద్రబాబు తనకన్నా చిన్నవాడైన, నలభై ఏళ్ల వయసులోనే ధైర్యంగా రాజకీయాలు చేస్తూ ముఖ్యమంత్రి అయిన వైయస్ జగన్ మోహన్ రెడ్డిను చూసి అక్కస్సుతో మాట్లాడుతున్నాడు. ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. ప్రతి క్రిస్మస్‌కి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు చర్చికి వెళ్లి యేసు ప్రభువును ఆరాధిస్తారు. ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు కూడా. అందుకే వీరు బరితెగించి మాట్లాడుతున్నారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేవాలయాలపై దాడులు జరిగితే ఆయనకు రాజకీయ లాభం వస్తుందా? పవిత్ర విగ్రహాలు ధ్వంసం అయితే వైయస్ జగన్‌కు లాభం ఏంటి? ఏ రాజకీయ నాయకుడైనా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎందుకు చేస్తాడు? మళ్లీ ముఖ్యమంత్రి కావాలనే కదా? వైయస్ జగన్ హయాంలో ఆలయాలపై దాడులు జరిగితే ఆయనకు నష్టమా? లాభమా? ప్రత్యర్థి అయిన నారా చంద్రబాబు నాయుడుకే లాభం కాదా?
● ఇదేనా మీ భక్తికి తార్కాణం బాబూ?
చంద్రబాబు గారు… మీరు మీ కిరాయి మూకలను ప్రోత్సహించి గుడులపై దాడులు చేయించిన అంశంలో మీ పాత్ర ఉందా లేదా? మీరా? మీ అనుచరులా? ఎవరున్నారు? ప్రజలకు చెప్పాలి. నిజంగా దేవుడిపై భక్తి ఉంటే 2014 నుంచి 2019 వరకు ఎన్ని గుడులను జేసీబీలతో కూల్చారు? రాజధాని నడిబొడ్డున ఎన్ని ఆలయాలు కూల్చారో వీడియోలు ఉన్నాయి. టీడీపీ హయాంలో జరిగిన ఆలయాల కూల్చివేతల తర్వాత మీ భక్తిని ఎవరైనా నమ్ముతారా? . ఇలా గుడులు కూల్చితే దేవుడిపై భయం ఉన్నట్టా? ఇదేనా మీ భక్తికి తార్కాణం?
● ఈ పాపం ఎవరిది?
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాశీనాయన ఆలయంలో కూల్చివేతలు ప్రారంభించింది ఎవరూ? సనాతన ధర్మం గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్‌కు ఇవి తెలియవా? అటవీ శాఖ ఆదేశాలు లేకుండా కూల్చివేతలు జరిగాయా? ప్రజలు నమ్ముతారా?. శ్రీకాకుళంలోని ఖుర్మా మందిరానికి నిప్పు అంటించారు. ఆ ఆలయాన్ని పునర్నిర్మించారా? సింహాచలంలో గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందారు. గుడిలో మరణాలు అపచారం కాదా? ఇది ప్రభుత్వ బాధ్యతారాహిత్యం కాదా?. తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆత్మపరిశీలన చేసుకున్నారా? టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరుడు కిశోర్ రెడ్డి ప్రోద్భలంతో అర్ధరాత్రి ఆలయ విధ్వంసం జరిగింది. తిరుచానూరులో వారాహీ ఆలయాన్ని కూల్చింది ఎవరు? మీ పార్టీకి చెందిన వారే కాదా? గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు మూడు మునకలు వేయడానికి 29 మంది భక్తులు ప్రాణాలు బలిగొన్నారు. తిరుమల తిరుపతిలో వెయ్యి కాళ్ల మండపాన్ని కూల్చింది మీరే కాదా? ఈ పాపం ఎవరిది? . రామతీర్థంలో స్వామివారి విగ్రహం ధ్వంసం చేసిన వ్యక్తికి సీఎంఆర్‌ఎఫ్ నిధులు ఇచ్చారు. వైయస్ జగన్ హయాంలో జైలుకు వెళ్లిన వారికి ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు చెల్లించారు. ఇది న్యాయమా?
● మీరు కూల్చిన ఆలయాలు పునర్నిర్మించిందే వైయస్.జగన్
చంద్రబాబు ప్రభుత్వంలో కూల్చిన ఆలయాలను వైయస్ జగన్ ప్రభుత్వం పునర్ నిర్మించింది. అంతర్వేది ఆలయంలో దుర్మార్గుల ప్రోద్బలంతో అర్ధరాత్రి రథానికి నిప్పంటించారు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో కోటి రూపాయల నిధులతో123 రోజుల్లోనే రథసప్తమి నాటికి రథాన్ని పునర్నిర్మించారు. రామతీర్థం ఆలయ ట్రస్ట్ నిర్లక్ష్యం కారణంగా భద్రత ఏర్పాట్లు కరువయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ రూ.3 కోట్లతో రాతి కట్టడం ద్వారా ఆలయాన్ని పునర్నిర్మించారు. బందర్‌లో వెంకటేశ్వరస్వామి ఆలయం జీర్ణావస్థలో ఉంటే దూపధీప నైవేద్యాలకు కూడా నిధులు ఇవ్వలేదు, వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఆ ఆలయాన్ని దేవాదాయ శాఖకు అప్పగించి పునర్నిర్మాణం చేపట్టారు.
● శ్రీవాణి ట్రస్ట్‌పై ఏం చర్యలు తీసుకున్నారు?
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీవాణి ట్రస్ట్‌ను రద్దు చేస్తామని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ట్రస్ట్ నిధులపై ఆరోపణలు ఉంటే ప్రభుత్వం విచారణ చేపట్టాలి కదా? టీటీడీలో కొండపై వసతి గదుల కేటాయింపులో రూ.1500 నుంచి రూ.2000 వరకు వసూలు చేస్తున్నారని భక్తులు చెబుతున్నారు. దర్శనం కోసం రూ.10 వేలు వరకు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలపై ప్రభుత్వం స్పందించాలి. టీటీడీ విజిలెన్స్ వ్యవస్థ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.
వైయస్ జగన్ శ్రీవాణి ట్రస్ట్‌కింద ఐదేళ్లలో 5263 ఆలయాల్లో పనులను మంజూరు చేసింది వాస్తవమా కాదా? ఇందులో తెలుగు రాష్ట్రాల్లో గుడి నిర్మాణాలు కానీ, గాలి గోపురాలు కానీ, ఆలయాల్లో వంటశాలలు కానీ ఉన్న మాట వాస్తమమా కాదా ?, ఆలయాల్లో వివిధ నిర్మాణాల కోసం శ్రీవారి ట్రస్టు ద్వారా రూ.664.75 కోట్ల నిధులు మంజూరు చేసింది వాస్తవమా కాదా ?, రామతీర్ధం ఆలయ విగ్రహ పునర్ నిర్మాణం 2021 డిసెంబర్ 3న శంఖుస్థాపన చేస్తే.. 123 రోజుల్లోనే 3 కోట్ల రూపాయలతో నిర్మాణం పూర్తి చేశారు. అంతర్వేది రథం 2020 సెప్టెంబర్ 6న కళంకం జరిగితే ఐదు నెలల రెండు వారాల్లో రథాన్ని పునర్ నిర్మాణం చేసి 2021 ఫిబ్రవరి 19 రథసప్తమి రోజున స్వయంగా జగన్మోహన్ రెడ్డి స్వామికి అంకితం చేశారు.
● కల్తీ నెయ్యి పాపం మీదే చంద్రబాబూ..
మీరు సీఎం అయ్యాక పెట్టిన రెండో సంతకం ప్రకారం టీటీడీ ఈవో శ్యామలరావును నియమించారుగా.. ఇప్పుడు ఆయన ఎందుకు కనిపించట్లేదు? అంటే మీ అవసరాలు పూర్తయ్యాయా? ఆయన్ను టీటీడీ నుంచి జీఏడీలోని అప్రాధాన్య పోస్టులోకి ఎందుకు మార్చారు? మీరు చెప్పిన డెయిరీల దగ్గర నెయ్యి కొనడం లేదనే ఆయన్ను బదిలీ చేశారా ? మీ కంపెనీ ఇందాపూర్ డెయిరీకి ఏమైనా అడ్డుచెప్తున్నారా ?, మీ రెండో సంతకం, సంకల్పం ఏమైందో చెప్పండి. 2024 జూన్ లో ఆయన్ను నియమిస్తే జూలై 6 న నాలుగు శాంపిల్స్, జూలై 12వ తేదీన మరో నాలుగు శాంపిల్స్ తీశారు, జూలై 16న 6వ తేదీన తీసిన శాంపిల్స్ రిపోర్ట్ వచ్చింది, జూలై 12న తీసిన శాంపిల్స్ రిపోర్ట్ జూలై 23న వచ్చింది. ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్టులు జూలై 16, 23న వచ్చాయి. వెంటనే జూలై 25వ తేదీన ట్యాంకర్లు వెనక్కి పంపించారు. ఆ ట్యాంకర్లు ఎక్కడికి వెళ్లాయో సిట్ ఇప్పటికే బయటపెట్టింది.
ఆ ట్యాంకర్లు వైష్ణవీ డెయిరీకి సమీపంలోని రాఘవేంద్ర క్రషర్ లో పెట్టడం, తిరిగి కొన్నాళ్ల తర్వాత తిరిగి వైష్ణవీ డెయిరీకి తీసుకెళ్లి అక్కడి నుంచి టీటీడీకి అప్పగించడం వాస్తవమా కాదా ?, పందికొవ్వు, గొడ్డు కొవ్వు కలిసిన ఆ నెయ్యిని టీటీడీ మళ్లీ వైష్ణవీ డెయిరీ మీద తిరిగి వచ్చాక కొని, దాంతోనే లడ్డూ తయారు చేసి భక్తులకు పంపేశారు కదా. అప్పుడు సీఎం, డిప్యూటీ సీఎం మీరే కదా. ఈ పాపం వైయస్.జగన్ కి మీరు అంటగడుతున్నారు. ఇప్పుడు చెప్పండి అసలు పాపం ఎవరిదో?
● మీ హయాంలోనే నెయ్యి కొనుగోళ్లలో అక్రమాలు..
ఉత్తరాఖండ్ భోలేబాబా అరోగనిక్ డెయిరీ యాజమాన్యం, వైష్ణవీ డెయిరీ యాజమాన్యం ఒకరే కదా. భోలేబాబా నుంచి నెయ్యి వస్తే, మీరు తిప్పి పంపిస్తే వైష్ణవీ డెయిరీకి వచ్చి, అక్కడి నుంచి తిరిగి టీటీడీకి వచ్చింది, మీరు ఆ నెయ్యి వాడేశారని సిట్ తేల్చింది. భోలేబాబా డెయిరీకి పొమిల్ జైన్, విపుల్ జైన్ ఇద్దరూ ఓనర్లుగా ఉన్నారు, వైష్ణవీ డెయిరీ ఓనర్లు కూడా వాళ్లే. వైష్ణవీ పార్ట్ నర్ టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు చెందిన సంగం డెయిరీ. ఇవాళ అసెంబ్లీలో పెద్ద పెద్ద రంకెలేసిన ధూళిపాళ్ల నరేంద్ర ఇప్పుడేం చెప్తారు ? అలాగే భోలేబాబా, వైష్ణవీ డెయిరీల ఓనర్లు పొమిల్ జైన్, విపుల్ జైన్ ఇద్దరికీ హెరిటేజ్ లో వాటాలు ఉన్నమాట వాస్తవం కాదా చంద్రబాబు చెప్పాలి. ఏఆర్ డెయిరీ చంద్రబాబుకు దగ్గరా, జగన్మోహన్ రెడ్డికి దగ్గరా ప్రభుత్వం చెప్పాలి. ఏఆర్ డెయిరీ ఓనర్ రాజు రాజశేఖర్ డిండిగల్ హెరిటేజ్ ఫ్యాక్టరీని కట్టించింది నిజమా కాదా ?, నిబంధనలు సడలించి, నాణ్యతా ప్రమాణాలు తగ్గించారని చెప్తున్న చంద్రబాబు.. దాని నేపథ్యం కూడా చెప్పాలి. మళ్లీ నిబంధనలు కట్టడి చేసింది కూడా వైయస్.జగన్ ప్రభుత్వంలోనే అని తెలియదా ?, ఇవాళ్టికీ అవే నిబంధనలు అమల్లో ఉన్నాయి, వాటిని కూటమి ప్రభుత్వం కూడా కొనసాగిస్తోంది. నెయ్యి కొనుగోలు కమిటీలో ఉన్న సభ్యులు అసలు కాంపిటేషన్ జరగడం లేదని అసెంబ్లీలో మీ సభ్యులే చెప్తున్నారుగా. సీఎఫ్టీఆర్ఐ రిపోర్ట్ లో ఉన్న ప్రీమియర్ డెయిరీ, ఆల్ఫా డెయిరీ, మాల్ గంగా డెయిరీ, వైష్ణవీ డెయిరీలు 2025 జనవరి వరకూ నెయ్యి సరఫరా చేశాయిగా, ఇప్పుడు మీ నిబద్దత ఏమైందో చెప్పండి. దేవుడిపై అపారభక్తి ఉన్న చంద్రబాబు ఆయా డెయిరీలపై సీఎఫ్టీఆర్ఐ రిపోర్ట్ ప్రకారం ఎందుకు చర్యలు తీసుకోలేదు.
● మీ లాజిక్ ప్రకారం వీళ్లు సరఫరా చేసింది కల్తీ నెయ్యా?
తక్కువ రేటుకు నెయ్యి కొన్నారని ప్రశ్నిస్తున్న మీరు.. మీ హయాంలో రూ.273, రూ. 264కు కేజీ నెయ్యి 2014-19లో ఎలా కొన్నారో చెప్పండి. 2014-19 మధ్య టీటీడీ లడ్డూ ప్రసాదానికి అవసరమైన నెయ్యిలో 90 శాతం సీఎఫ్టీఆర్ఐ రిపోర్ట్ లో ఉన్న ప్రీమియర్ ఆగ్రో డెయిరీ సరఫరా చేసింది. 2016 మార్చిలో కేజీ నెయ్యి రూ.332, సెప్టెంబర్ లో రూ.364కు, ఏప్రిల్ 2017 లో రూ.411కు, అక్టోబర్ 2017లో రూ.378, జనవరి 2018 రూ.320, జూన్ 2018లో రూ.321కు కేజీ నెయ్యి ప్రీమియర్ డెయిరీ సరఫరా చేసింది. ఇది నెయ్యా కల్తీయా మీ లాజిక్ ప్రకారమే చెప్పండి. గత చంద్రబాబు హయాంలో టీటీడీకి 90 శాతం నెయ్యి సరఫరా చేసిన ప్రీమియర్ డెయిరీకి చెందిన ఆశిష్ గుప్తా, రేణూ గుప్తాకు హెరిటేజ్ డెయిరీలో వాటాలున్నాయంటున్నారు, ఇది నిజమో కాదో చంద్రబాబు చెప్పగలరా ?, సీఎఫ్టీఆర్ఐ రిపోర్ట్ లో ఉన్న ప్రీమియర్ డెయిరీ, ఆల్ఫా డెయిరీ ఇద్దరూ లంబూ జంబూ కాదా చెప్పాలి, వీళ్లకు హెరిటేజ్ లో షేర్లు ఉన్నాయో లేదో చెప్పాలి.
● బయటపడ్డ హెరిటేజ్ -ఇందాపూర్ డెయిరీ బంధం..
ఢిల్లీ హైకోర్టులో హెరిటేజ్ తమ కంపెనీ నాశనం చేసే వాళ్లు తమను ఏమీ చేయలేక, రాయలసీమలో మనుషుల్ని నరకలేక తోటలు నరికినట్లు.. భోలేబాబాతో సంబంధం ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారని పిటిషన్ వేసింది. భోలేబాబా అరొగోనిక్ కూ, సీబీఐ ఛార్జిషీట్ లో ఉన్న భోలేబాబా అరోగోనిక్ కూ, మాకూ సంబంధం లేదని అందులో చెప్పారు. తమకు సంబంధం ఉంది ఢిల్లీ, రాజస్థాన్ లో ఉన్న భోలేబాబా డెయిరీలతో సంబంధం ఉన్నట్లు చెప్పారు. ఐటీ శాఖ ఉత్తరాదిలో 35 డెయిరీల్లో 131 గంటల పాటు సోదాలు చేసి ఉత్తరాఖండ్, ధోల్ పూల్, రాజస్థాన్, ఢిల్లీ భోలేబాబా డెయిరీలన్నీ ఒకే గొడుగు కింద ఉన్న సంస్దలన్ని తేల్చారు. ఇవన్నీ రూ.700 కోట్లు పన్ను ఎగవేసినట్లు నిర్దారించారు. మీకు నిజాయితీ ఉంటే ఫిబ్రవరి 12వ తేదీ మీ వెబ్ సైట్లో హెరిటేజ్ లో 23 కంపెనీలు తమ మాన్యుఫ్యాక్చరర్ అని చెప్పి ఆ తర్వాత కో-మాన్యుఫ్యాక్చరర్ అని ఎందుకు మార్చారో చెప్పాలి. ప్రీమియర్ డెయిరీకి 90 శాతం రుణాలు బ్యాంక్ ఆఫ్ బరోడాయే ఇచ్చింది. హెరిటేజ్ లో మీ కుటుంబం కాకుండా అతిపెద్ద వాటా బ్యాంక్ ఆఫ్ బరోడాయే అంటున్నారు. ఈ రెండు బ్యాంక్ ఆఫ్ బరోడాలూ ఒకటేనా కాదా చెప్పాలి. ఆగ్రాలో 2026 జనవరి 26న ఐటీ సోదాలు జరిగితే అందులో దొరికిన దావోజీ డెయిరీ కల్తీ నెయ్యికి పెట్టింది పేరని పత్రికలు రాశాయి. గత చంద్రబాబు ప్రభుత్వంలో టీటీడీకి ఈ డెయిరీ కూడా నెయ్యి సరఫరా చేసింది, అది కల్తీయా కాగా చెప్పాలి. అలాగే 2015లో టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన గోవింద్ మిల్క్ ఓనర్లకూ హెరిటేజ్ లో షేర్లు ఉన్నాయన్నది నిజమా కాదా ?, ధోల్ పూర్ భోలేబాబాకూ, తమకూ సంబంధాలు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారని కోర్టులో ఆరోపించిన హెరిటేజ్.. అందులో రూ.105 కోట్లు పెట్టుబడి పెట్టింది నిర్మల్ ఇంపెక్స్, టీఎన్జీ ఇన్ ఫ్రా, స్పీడ్ వెల్. ఇందులో నిర్మల్ ఇంపెక్స్, టీఎన్జీ ఇన్ ఫ్రాకు ఓనర్ ఒకరే. ఈ రెండింటిలో హెరిటేజ్ కంపెనీ పెట్టుబడి ఉందని పాల మాఫియా చెబుతోంది. అంటే భోలేబాబా, నిర్మల్ ఇంపెక్స్, టీఎన్జీ ఇన్ ఫ్రాకూ సంబంధం ఉన్నట్లేగా. భారత్ లో పెద్ద డెయిరీ మాఫియా నడుస్తోందని దీన్ని బట్టి అర్దమవుతోంది. దీనికి వైట్ కాలర్ డాన్ ఎవరు, ఇండియా మాఫియా డెయిరీకి పాబ్లో ఎస్కోబార్, ఎల్ చాపో, ఎల్ మాంచో ఎవరో చంద్రబాబా కాదా అనేది ఆయనే చెప్పాలి. మీ పాపాలేవీ లేకపోతే ఫిబ్రవరి 12న హెరిటేజ్ వెబ్ సైట్ మొత్తం ఎందుకు మార్చారు?, మీ గుట్టు రట్టయిందనే ఇలా మార్చారా ?, ఈ లింకులేవీ చంద్రబాబుకు గుర్తులేకపోయినా హెరిటేజ్, ఇందాపూర్ లింక్ బయటపడగానే వివరణ ఇచ్చిన ప్రభుత్వ సలహాదారు కుటుంబరావుకు తెలుసు కదా.
● మీ తమ్ముడు మరణించినా తిరుమల ఎలా వెల్లావ్ బాబూ?
మన కుటుంబసభ్యుడు మరణిస్తే ఏడాది వరకు మనం గుడికి వెళ్లాం. అలాగే నా తండ్రి చనిపోతే నేను ఏడాది వరకు కొండమీదకు వెళ్లలేదన్న చంద్రబాబు.. అదే సమయంలో కొడుకు చనిపోతే ఈవో ధర్మారెడ్డి 12 రోజులు పూర్తవగానే కొండమీదకు ఎలా వస్తాడని మాట్లాడారు. నేను స్వామివారికి పట్టుబట్టలు కూడా పెట్టలేదని చెప్పిన మీకు మతిమరుపా చంద్రబాబూ? లేదా ప్రజలు అమాయకులు అనుకుని నటిస్తారా? మీ సొంత తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు 2024 నవంబరు 16 న మరణిస్తే... మార్చి 21, 2025న మీ మనవడి పుట్టినరోజున తిరుమలకు వెళ్లి టీటీడీకి రూ. 44లక్షలు దానం ఇచ్చి పూజలు చేయలేదా? మీ తమ్ముడు చనిపోతే సంవత్సరం తిరక్కముందే కొండపైకి ఎందుకు వెళ్లారు?. నాన్న చనిపోతే వెళ్లలేదని చెప్పిన చంద్రబాబు, తమ్ముడు చనిపోతే ఎందుకెళ్లారో చెప్పాలి.
సీబీఐ సిట్ నివేదిక పేజి నెంబరు 29లో లడ్డూ ప్రసాదంలో జంతుకొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనే లేదని చెబితే.. మీరు మాత్రం కల్తీ అవినీతిని సిట్ నిగ్గుతేల్చిందని చెబుతున్నారు.
● ఆర్టీసీ బస్సు టిక్కెట్లపైనా నీచమైన ప్రచారం...
ఇంకా పచ్చిగా అత్యంత దుర్మార్గంగా తిరుమల కొండపైకి వెళ్లే బస్సుల్లో ఇచ్చే టిక్కెట్లు మీద పవిత్ర జెరూసలెం యాత్ర అని ముద్రించారంటూ మాట్లాడారు. ఆర్టీసీ బస్సు టిక్కెట్లు వెనుక మైనార్టీ సంక్షేమ శాఖ స్పాన్సర్ చేసే ప్రభుత్వ కార్యక్రమాలను ప్రింట్ చేయాలని జీవో ఇచ్చివాడిన ఏమనాలి. మంచివాడు అనాలా? వెధవ అనాలా? చంద్రబాబు హయాంలో 2014 -19 వరకు పవిత్ర జెరూసలెం యాత్ర, పవిత్ర మక్కా యాత్ర అని ప్రభుత్వం రూపొందిస్తున్న పథకాలను టిక్కెట్ వెనుక ముద్రించాలని మైనార్జీ సంక్షేమశాఖ ఆర్టీసీకి అప్పగిస్తూ జీవో ఇచ్చింది. అందులో భాగంగానే నెల్లూరు రీజియన్ లో చంద్రబాబు హయాంలోనే భారీ ఎత్తున ఈ టిక్కెట్లు ముద్రించారు. అవి వైయస్.జగన్ వచ్చే వరకు చలామణీలో ఉన్నాయి. దానికి వైయస్.జగన్ కి ఏం సంబంధం? ఈ పాపం ఎవడిది? వైయస్.జగన్ వచ్చే వరకు ఈ టిక్కెట్లు చలామణీలో ఉన్నాయి. ఎవడిది పాపం? నువ్వా పాపాత్ముడివి, వైయస్.జగనా? హైందవమతాన్ని కలంకితం చేసి, కొండమీద అన్యమత ప్రచారాన్ని ఆర్టీసీ టిక్కెట్లుతో చేసింది నువ్వు కాదా? నీ కంటే దుర్మార్గుడు ఉంటాడా?
● ఏడు కొండలు జీవో ఇచ్చిందే వైయస్సార్...
ఎన్టీరామారావు సీఎంగా ఉన్నప్పుడు తిరుమల క్షేత్రానికి సంబంధించి 1986లో చల్లా కొండయ్య కమిషన్ వేస్తే 27.45 కిలోమీటర్లు టీటీడి పరిధి అని రిపోర్టు ఇచ్చారు. తర్వాత టీడీపీకి చెందిన జయచంద్రనాయుడు బాలాజీనగర్ కి ఎన్నికలు పెట్టాలని కోర్టుకు వెలితే అప్పటి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా జేసీ దివాకర్ రెడ్డి గారు... టీటీడీ కొండమీద 27.4 కిలోమీటర్ల పరిధిలో రాజకీయ ప్రచారం జరగడానికి, ఎన్నికలు జరపడానికి వీల్లేదు కాబట్టి... ఎన్నికలు జరపలేమని జీవో ఇచ్చారు .ఆ తర్వాత బ్రిటిష్ వారు నిర్ణయించినట్టు, చల్లా కొండయ్య కమిషన్ నిర్ణయించినట్లు 27.4 కిలోమీటర్లు పరిధి కాకుండా.. ఏకంగా 350 కిలోమీటర్లుపైగా ప్రాంతాన్ని టీటీడి పరిధి అని నిర్ణయిస్తూ ఒక జీవోని, దాంతో పాటు టీటీడీ పరిధిలో ఎక్కడా అన్యమత ప్రచారం చేయకూడదని నిర్ణయిస్తూ మరో జీవోని వైయస్.రాజశేఖర్ రెడ్డి జారీ చేశారు. కానీ చంద్రబాబు మాత్రం వైయస్సార్ హయాంలో రెండు కొండలు అని చెప్పి... తాను గొడవ చెయ్యడం వల్లే ఏడు కొండలు అని జీవో ఇచ్చాడని పచ్చి అబద్దాలు చెబుతున్నారు. మీకు దమ్ముంటే మీ దగ్గర ఆ జీవోలు ఉండి ఉంటే, స్వామి వారంటే భక్తి ఉంటే... భయటపెట్టండి. ఇంత పచ్చిగా మతాన్ని రాజకీయం కోసం వాడుకోవడం హైందవ ధర్మమా? మీకు సిగ్గనిపించడం లేదా చంద్రబాబూ? ఇది తప్పుకాదా అని సూటిగా నిలదీశారు. తల్లిదండ్రులు చనిపోతే తలనీలాలు ఇవ్వని చంద్రబాబు, తన రాజకీయం కోసం భార్యతో తలనీలాలు ఇప్పించిన పవన్ కళ్యాణ్ లు ఇప్పటికైనా ఇలాంటి పాపాలు మానుకుని, నిజాయితీగా రాజకీయాలు చేయాలని సూచించారు.
చంద్రబాబుకి నిజాయితీ ఉంటే, హైందవం పట్ల నిబద్దత ఉంటే, శ్రీ వేంకటేశ్వరస్వామి అంటే భక్తి ఉంటే... 2014 నుంచి ఇప్పటివరకు స్వామి వారికి నెయ్యి సరఫరా చేసిన కంపెనీల మూలాల్లోకి దమ్ముంటే సీబీఐతో విచారణ చేయించాలని పేర్ని నాని సవాల్ విసిరారు.