దయనిధి మాటలు ఆయన అవివేకానికి నిదర్శనం
విజయవాడ: డీఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్ మాటలు ఆయన అవివేకానికి నిదర్శనమని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ అన్నారు. సనాతన ధర్మంపై విమర్శలు చేయడం ధర్మంకాదని హితవు పలికారు. మంగళవారం మంత్రి కొట్టు సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు, నారా లోకేశ్‌ను అరెస్ట్ చేస్తేనే ఏపీలో శాంతి భద్రతలు నెలకొంటాయి. చంద్రబాబు అవినీతి అనకొండ. చంద్రబాబు అవినీతి రూ.118కోట్లు మాత్రమే కాదు.. ఇంకా చాలా ఉంది. చంద్రబాబు అవినీతి కేసుల్లో సీబీఐ, ఈడీ జోక్యం చేసుకోవాలి. అమరావతి ముసుగులో చంద్రబాబు రూ.వేల కోట్ల దోపిడీకి స్కెచ్ వేశారు. ఐటీ నోటీసులతో కేవలం ఆవగింజ అంత బయటపడింది. ఇంకా సింగపూర్ ఈశ్వరన్‌తో కలిసి పనిచేసిన అవినీతి దందా బయటపడుతుంది. చంద్రబాబు కచ్చితంగా జైలుకు వెళ్లడం ఖాయం.
తండ్రి బ్రోకర్.. కొడుక జోకర్..
రెండు వేల మంది గూండాలతో నారా లోకేశ్ పాదయాత్ర చేస్తున్నాడు. లోకేశ్ పాదయాత్రతో టీడీపీ గ్రాఫ్ మరింత దిగజారిపోయింది అని మంత్రి సెటైర్లు వేశారు. తండ్రి బ్రోకర్.. కొడుక జోకర్ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు రియల్ ఎస్టేట్ బ్రోకర్ అని ఇప్పుడు తేలిపోయింది. కోట్లు ఖర్చు పెట్టి ఫేక్ ఉద్యమాలు చేశారు అంటూ ఘాటు విమర్శలు చేశారు.