వైయస్ఆర్‌సీపీ ఒంటరిగానే పోటీ
17 Jan, 2023 11:38 IST

విజయవాడ: వచ్చే ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. పవన్ కల్యాణ్.. చంద్రబాబు సీఎం అవ్వడం కోసం పనిచేస్తున్నాడని ఆరోపించారు. పవన్ కల్యాణ్ వెనకాల వచ్చేవాళ్లు మాత్రం పవన్ సీఎం అవ్వాలనుకుంటున్నారని తెలిపారు. మా పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుంది.. మాకు ఎవరి మద్దతు అవసరం లేదు.. మా బలం మాకు సరిపోతుందన్నారు .