కొమ్మినేని విడుదల..సుప్రీం కోర్టు తీర్పు పట్ల వైయస్ఆర్‌సీపీ నేతల హర్షం
13 Jun, 2025 14:45 IST
విశాఖపట్నం: సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు ను విడుదల చేయాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల వైయస్ఆర్‌సీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. కొమ్మినేనిని తక్షణమే రిలీజ్ చేయాలంటూ.. ఆయన అరెస్ట్ అక్రమమని సర్వోన్నత న్యాయస్థానం తేల్చేసింది. సాక్షి, కొమ్మినేనికి కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలకు ఏ సంబంధం లేకపోయినా.. వాటిని ఆపాదిస్తూ ఎల్లో బ్యాచ్ ఎంతగా రెచ్చిపోయిందో తెలిసిందే. సుప్రీం కోర్టు తీర్పుపై వైయస్ఆర్‌సీపీ నేతలు స్పందించారు. ఎవరెవరు ఏమన్నారంటే..
మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్
- సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావును విడుదల చేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నాను.
- సుప్రీం కోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి, రెడ్ బుక్ రాజ్యాంగానికి చెంపపెట్టు.
- సుప్రీం కోర్టు తీర్పుతో కొమ్మినేనిది అక్రమ అరెస్టు అని తేలింది.
- కొమ్మినేని అరెస్టు వ్యవహారంపై సుప్రీం చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసింది.
- ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్న సుప్రీం కోర్టు వ్యాఖ్యలు రాష్ట్రంలో గాడితప్పిన పాలనకు హెచ్చరిక.
- పత్రికా స్వేచ్ఛను హరిస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరెస్టులు అక్రమమని సుప్రీం స్పష్టం చేయడం హర్షనీయం.
- కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా 70 ఏళ్ల సీనియర్ జర్నలిస్టు అరెస్టులో అత్యంత అమానవీయంగా వ్యవహరించారు.
- ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అక్రమ అరెస్టులు, కక్ష సాధింపు చర్యలు ఆపాలి : మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.
సుప్రీం కోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు : మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు
- సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావుని విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలు హర్షనీయం.
- కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టులో రాష్ట్ర ప్రభుత్వం కనీస నిబంధనలు పాటించలేదన్న విషయం సుప్రీం కోర్టు తీర్పు ద్వారా స్పష్టమైంది.
- రాష్ట్రంలో అమలవుతున్న రెడ్ బుక్ రాజ్యాంగానికి ఈ తీర్పు కచ్చితంగా చెంపపెట్టు.
- కోర్టు తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వం చేసింది ముమ్మూటికీ అక్రమ అరెస్టే అని తేలింది.
- ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్న సుప్రీం వ్యాఖ్యలు రాష్ట్రంలో పరిస్ధితికి అద్దం పడుతున్నాయి.
- ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో అక్రమ అరెస్టులు ఆపాలి.
- బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలుచేయాలి.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి
- కొమ్మినేని అరెస్ట్ పై సుప్రీం కోర్టు అత్యద్భుతమైన తీర్పు ఇవ్వడం జరిగింది
- కొమ్మినేని శ్రీనివాసరావు అక్రమ అరెస్ట్ పై సుప్రీం కోర్టు తీర్పు కూటమి ప్రభుత్వం కు చెంప పెట్టు లాంటిది
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పత్రిక స్వేచ్ఛను హరించే విధంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు సుప్రీం కోర్టు తీర్పు తో బుద్ధి చెప్పింది
- ఏపీ లో పత్రిక స్వేచ్ఛ ను సర్వనాశనం చేయాలని చూస్తున్న ప్రభుత్వానికి ఈ తీర్పు చెంప పెట్టు లాంటిది
- కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్ మోహన్ రెడ్డి ను ఏవిధంగా బలహీన పరచాలని చూస్తూనే, సాక్షి మీడియాపై దాడులు చేయించింది
- డిబేట్ నిర్వహించే వారిని అరెస్ట్ చేయడం అక్రమమని సుప్రీం కోర్టు తేల్చి
- చెప్పింది
- ఈ తీర్పు ద్వారా సుప్రీం కోర్టు ప్రజాస్వామ్యాన్ని పునాదులను నిలబెట్టింది
- సాక్షి కార్యాలయాలు పై దాడి చేసిన గుండాలు, రౌడీ మూకలను వెంటనే అరెస్టు చేయాలి
మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
- కొమ్మినేని అరెస్ట్ విషయంలో సుప్రీం తీర్పు చంద్రబాబు ప్రభుత్వానికి చెంపపెట్టు
- పత్రికా స్వేచ్చను కాలరాసిన కూటమి ప్రభుత్వానికి సుప్రిం తీర్పు కనువిప్పు కావాలి
- పత్రికా స్వేచ్ఛ యొక్క ప్రాముఖ్యతను సుప్రీం తీర్పులో నొక్కి చెప్పింది
- వాక్ స్వాతంత్య్రం మరియు భావ ప్రకటనా హక్కుని సుప్రిం తీర్పు ద్వారా కూటమి ప్రభుత్వానికి గుణపాఠం కావాలి