శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా కోలగట్ల వీరభద్రస్వామి
19 Sep, 2022 12:14 IST
అసెంబ్లీ: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిప్యూటీ స్పీకర్ పదవికి ఎమ్మెల్యే వీరభద్రస్వామి నామినేషన్ దాఖలు చేయగా, ఆయనను ప్రతిపాదిస్తూ ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. ఒకే నామినేషన్ దాఖలు కావడంతో కోలగట్ల వీరభద్రస్వామి ఉపసభాపతిగా ఎన్నికైనట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. కోలగట్ల వీరభద్రస్వామిని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అభినందిస్తూ గౌరవపూర్వకంగా సభాపతి కుర్చీ వద్దకు తీసుకెళ్లారు. అనంతరం పలువురు సభ్యులు వీరభద్రస్వామికి అభినందనలు తెలిపారు. కోలగట్ల వీరభద్రస్వామి విజయనగరం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.