పేదలకు వైద్య సేవలు దూరం చేసే కుట్ర‌

19 Nov, 2025 13:28 IST

క‌ర్నూలు: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీపీపీ విధానంతో పేదలకు  వైద్య వైద్య సేవలు భారం అవుతాయని నగర మేయర్ మహమ్మద్ వసీం విమర్శించారు. మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా కర్నూలు జిల్లా పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు నాయకత్వం అస్లాం బాష  ఆధ్వర్యంలో కర్నూలు న‌గ‌రంలోని గౌరీ గోపాల్ ఆసుప‌త్రికి ఎదురుగా ఉన్న‌ ధర్నా చౌక్ దగ్గర చేప‌ట్టిన కోటి సంతకాల కార్యక్రమంలో పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్పీ మోహన్ రెడ్డి, మాజీ కుడా చైర్మన్ కోట్ల హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌రెడ్డిల‌తో క‌లిసి డాక్టర్ ఆదిమూలపు సతీష్  పాల్గొని  మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ వ‌ల్ల క‌లిగే అన‌ర్థాల‌ను వివ‌రిస్తూ కూట‌మి ప్ర‌భుత్వ తీరును ఎండ‌గ‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..   వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిర్మాణం చేపట్టి పేదలకు వైద్య విద్యను అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేశారన్నారు. అన్ని జిల్లాలలో ఒక్కొక్క మెడికల్ కాలేజీ నిర్మించి విద్యార్థులు వైద్య విద్యను చేరువ చేయాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేస్తే  కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెడికల్ కాలేజీ లను పిపిపి విధానంలోకి తీసుకువచ్చి పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తోందని విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలు  కూటమి ప్రభుత్వ పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారని, వైఎస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటి సంతకాల కార్యక్రమంలో స్వచ్చందంగా వచ్చి సంతకాలు చేస్తుండటమే ఇందుకు నిదర్శనమన్నారు.