అధికార లాంఛనాలతో కోడెల అంత్యక్రియలు: సీఎం ఆదేశం
17 Sep, 2019 13:11 IST
అమరావతి: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలు అధికార లాంఛనాలతో జరిపించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. సంబంధిత శాఖకు ఆదేశాలివ్వాలని సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంను ముఖ్యమంత్రి వైయస్ జగన్ సూచించారు.