పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి సీఎం వైయస్ జగన్
18 Jul, 2019 12:47 IST
అమరావతిః రైతులు,పేదల కోసం పనిచేసే ప్రభుత్వం వైయస్ జగన్ ప్రభుత్వమని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు.అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి వైయస్ జగన్ అని ప్రస్తుతించారు.పేదల దీవెనతో 50 శాతంపైగా ఓట్లతో అధికారంలోకి వచ్చిన వ్యక్తి వైయస్ జగన్ అని అన్నారు.దొడ్డిదారినో,వెన్నుపోటు పోడిచి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాదన్నారు. ప్రజలకు నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు.సెప్టెంబర్ 1 నుంచి శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రారంభించబోతున్నామన్నారు.కొత్త ధాన్యం సేకరించిన తర్వాత అన్ని జిల్లాలకు పంపిణీ చేస్తామన్నారు. పూర్తిగా రైతులు నష్టపోవడానికి చంద్రబాబే కారణమని తెలిపారు.