సీఎం సహాయ నిధికి `కేఎంసీ` రూ.1.50 కోట్ల విరాళం
20 May, 2021 20:32 IST
సచివాలయం: కోవిడ్ -19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి కేఎంసీ కన్‌స్ట్రక్షన్స్ లిమిటెడ్ రూ. 1.50 కోట్ల విరాళం అందించింది. విరాళానికి సంబంధించిన డీడీని కేఎంసీ కన్‌స్ట్రక్షన్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మేకపాటి విక్రమ్ రెడ్డి, పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అసెంబ్లీలో సీఎం ఛాంబర్‌లో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు అందజేశారు.