నేడు `గడప గడపకు మన ప్రభుత్వం`పై కీలక సమావేశం
3 Apr, 2023 10:03 IST
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన నేడు `గడప గడపకు మన ప్రభుత్వం`పై కీలక సమావేశం జరగనుంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరగనున్న ఈ సమావేశానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్టీ ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గ సమన్వయ కర్తలు హాజరుకానున్నారు. గడపగడపకూ మన ప్రభుత్వంతో పాటు గృహసారథుల అంశాలపై ఈ సమావేశంలో సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ శ్రేణులతో చర్చించనున్నారు. అదేవిధంగా ‘జగనన్నే మా భవిష్యత్తు’ ఈనెల 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో క్యాంపెయిన్‌పై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.