కార్యకర్తల కుటుంబాలకు కాటసాని రామభూపాల్ రెడ్డి ప‌రామ‌ర్శ‌

27 Jan, 2026 14:44 IST

నంద్యాల జిల్లా:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే  కాటసాని రామభూపాల్ రెడ్డి  పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలిచారు. ఇటీవల జరిగిన ప్రమాదాలు, అనారోగ్య పరిస్థితుల నేపథ్యంలో బాధిత కుటుంబాలను స్వయంగా పరామర్శించి ధైర్యం చెప్పారు. కల్లూరు అర్బన్‌ పరిధిలోని 19వ వార్డు గణేష్ నగర్‌కు చెందిన వైయ‌స్ఆర్ సీపీ కార్యకర్త ఎరుకల నాగరాజు కుమారుడు అఖిల్, శకుంతల కళ్యాణ మండపం సమీపంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్ద రేగి పండ్ల కోసం వెళ్లిన సమయంలో కరెంటు షాక్‌కు గురై తీవ్రంగా గాయపడిన విషయం తెలుసుకున్న వెంటనే కాటసాని రామభూపాల్ రెడ్డి  వారి నివాసానికి చేరుకుని బాలుడిని, కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని, అవసరమైన అన్ని సహాయ చర్యలు చేపట్టాలని సూచించారు.

అనంతరం గడివేముల మండలం మంచాలకట్ట గ్రామానికి చెందిన వైయ‌స్ఆర్ సీపీ నాయకులు అనిల్ కుమార్ రెడ్డి  నాయనమ్మ అచ్చమ్మ గారికి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కర్నూలు నగరంలోని విజయ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఆమెను కూడా కాటసాని రామభూపాల్ రెడ్డి  పరామర్శించారు. డాక్టర్లను కలిసి ఆమె ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని వివరంగా అడిగి తెలుసుకొని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్త కుటుంబానికి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కష్టకాలంలో కార్యకర్తలను వదిలిపెట్టే సంస్కృతి వైయ‌స్ఆర్‌సీపీది కాద‌ని, మానవత్వం, సేవాభావమే పార్టీ బలమని పేర్కొన్నారు. కాటసాని రామభూపాల్ రెడ్డి  పరామర్శతో బాధిత కుటుంబాలు మనోధైర్యం పొందాయి. పార్టీ నాయకుడు తమకు అండగా నిలవడం పట్ల వారు కృతజ్ఞతలు తెలిపారు.