వైయ‌స్ఆర్‌సీపీ గెలవాలని కష్టపడ్డ కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు 

5 Jun, 2024 15:48 IST

పశ్చిమగోదావరి: అన్ని వర్గాలకు మంచి జరిగేలా వైయ‌స్‌ జగన్‌ పాలన చేశారనివైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుడు కారుమూరి నాగేశ్వ‌ర‌రావు  అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైయ‌స్ఆర్‌సీపీ గెలవాలని కష్టపడ్డ కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.  మంచి కంటే చెడు ఈజీగా ప్రచారం అవుతుంది. ల్యాండ్ టైటిల్ యాక్ట్‌ని భూతంలా చూపించి దుష్ప్రచారం చేశారు. జగన్ మీ ఆస్తులు తాకట్టు  పెట్టేస్తాడంటూ నమ్మించారు. ఇన్ని లక్షలమందికి అన్ని హక్కులతో  స్థలాలు ఇచ్చిన జగన్.. మీ ఆస్తులు ఎందుకు లాక్కుంటారు?. ప్రజలు, రైతులకు మంచి జరగాలని తపన పడ్డ మనిషి వైఎస్‌ జగన్. ఈవీఎంలపై రాష్ట్రమంతటా చర్చలు జరుగుతున్నాయి. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగి  ఉంటుందని మాకు అనుమానం ఉంది’’ అని కారుమూరి చెప్పారు.


భీమవరంలో ఈవీఎంలను ప్రైవేట్‌ కారులో తరలిస్తుంటే పట్టుకున్నారని ఆయన గుర్తు చేశారు. ఒక నియోజకవర్గంలో లక్ష ఎనభై వేల ఓట్లు పొలైతే  ముప్పై వేలు అధికంగా కనబడ్డాయి. ఈవీఎంలు ఏదో తేడా జరిగిందని  ప్రజలు చర్చించుకుంటున్నారు. కార్యకర్తలకు అండగా ఉంటామ‌ని కారుమూరి పేర్కొన్నారు.