వైయస్ జగన్‌తో కర్నాటక సీఎం కుమారస్వామి భేటీ
15 Jun, 2019 14:44 IST
న్యూఢిల్లీ: ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డితో కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఈ రోజు ఏపీ భవన్‌లో పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. అనంతరం ఢిల్లీలోని రోడ్ నం-1 జన్‌పథ్‌లో కర్నాటక సీఎం వైయస్ జగన్‌ను కలిసి అభినందనలు తెలిపారు.మరి కాసేపట్లో ప్రారంభం కానున్న నీతి అయోగ్ సమావేశంలో ఏపీ సీఎం వైయస్ జగన్ పాల్గొననున్నారు.