కరణం వెంకటేష్ వైయస్‌ఆర్‌సీపీలో చేరిక
12 Mar, 2020 17:44 IST

తాడేపల్లి: టీడీపీ చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేష్ వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వెంకటేష్ వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. ఆయనకు కండువా కప్పి పార్టీలోకి వైయస్ జగన్ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ..వైయస్‌ఆర్‌సీపీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. సీఎం వైయస్ జగన్ సంక్షేమ పాలనపై అన్ని వర్గాల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ చీరాల అభివృద్ధికి పాటుపడుతామన్నారు.