పవన్‌ నోరు అదుపులో పెట్టుకోవాలి

17 Apr, 2023 11:31 IST

విజయవాడ: జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ నోరు అదుపులో పెట్టుకోవాలని కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ అడపా శేషు హెచ్చరించారు. ఏపీ మంత్రులు తెలంగాణ ప్రజలను ఏమీ అనలేదన్నారు. కేవలం మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యలకు మాత్రమే బదులిచ్చారని తెలిపారు. ఏపీ ప్రజలను కించపరిచేలా పవన్‌ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాజకీయ కక్షతో మంత్రులపై పవన్‌ బురద చల్లుతున్నారని విమర్శించారు. ఏపీలో చందరబాబు, తెలంగాణలో కేసీఆర్‌ దగ్గర ప్యాకేజీ తీసుకున్నారని ఆరోపించారు. ఏపీ ప్రజలకు పవన్‌ క్షమాపణ చెప్పి రాష్ట్రానికి రావాలని అడపా శేషు డిమాండు చేశారు.