కాపులకు సీఎం వైయస్ జగన్ పెద్దన్న
విజయవాడ: కాపులకు పెద్దన్నలాగా సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అండగా నిలబడ్డారని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు పేర్కొన్నారు. కాపు సోదరులు పవన్ కల్యాణ్ ప్రభావానికి లోను కావద్దు. ఆయన వల్ల కాపులు అనేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. పవన్ సినిమాలు ఆడించి అనేకమంది కాపు సోదరులు ఆర్థికంగా దెబ్బతిన్నారు. సీఎం వైయస్ జగన్ నుంచి కాపులను దూరం చేసేలా పవన్ వ్యాఖ్యలు చేస్తున్నారు. సినీ పరిశ్రమలోనూ కాపులను విడగొట్టేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పారు.
కాపులకు గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా పథకాలు అమలు చేస్తున్నారు. కాపునేస్తం పథకం రూపశిల్పి.. వైఎస్ జగన్. కాపులకు ఎమ్మెల్యే, ఎంపీ, జెడ్పీ చైర్మన్లు, ఎంపీపీలుగా అవకాశం కల్పించారు. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా కాపులంతా బలోపేతం కావాలంటే పవన్ ప్రభావం నుంచి బయటకు రావాలి. కాపులు ఆవేశపరులే కాదు.. ఆలోచనాపరులు కూడా అని అడపా శేషు గుర్తు చేశారు.