‘ఉపాధి’ అక్రమాలపై చర్యలు తీసుకోవాలి
వైయస్ఆర్ జిల్లా: ఉపాధి హామీ పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ కేంద్ర మంత్రికి, జిల్లా కలెక్టర్ కు లేఖ రాశారు కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి. జిల్లాలో పెద్ద ఎత్తున ఉపాధి పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయని, చేయని పనులకు కూడా బిల్లులు చేసుకుంటున్నారని లేఖలో పేర్కొన్నారు. విదేశాల్లో ఉన్న వారిని సైతం మస్టర్లలో చూపుతున్నారని, ఫేక్ కార్డులు సృష్టించి అక్రమంగా నిధులు కాజేస్తున్నారన్నారు.
చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో ఉపాది హామీ ఉద్దేశమే దెబ్బ తింటోందని అవినాష్ రెడ్డి తెలిపారు. దీనిపై వెంటనే కమిటీ వేసి విచారణ చేపట్టాలన్నారు. నిధులు పెద్ద ఎత్తున దుర్వినియోగం అవుతూ అసలు లబ్ధిదారులు నష్టపోతున్నారన్నారు. పేద వాడికి చట్ట ప్రకారం అందాల్సిన ఉపాధికి గండి కొడుతున్నారని, ఈ అంశంపై వెంటనే కల్పించుకుని అక్రమాలను నిగ్గుతేల్చాలని ఎంపీ అవినాష్ రెడ్డి కోరారు.