జనసేన అమలాపురం ఇన్‌ఛార్జి శెట్టిబత్తుల రాజబాబు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

6 Apr, 2024 15:49 IST

శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా: మేమంతా సిద్ధం బస్సుయాత్రలో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్ మోహ‌న్ రెడ్డి సమక్షంలో అమలాపురం జనసేన పార్టీ నుంచి భారీగా వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆర్‌ఎస్‌ఆర్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ లంచ్‌ స్టే పాయింట్‌ వద్ద సీఎం వైయస్‌.జగన్‌ సమక్షంలో జనసేన అమలాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి శెట్టిబత్తుల రాజబాబు, ఉమ్మిడి తూర్పుగోదావరి జిల్లా జనరల్‌ సెక్రటరీ ఎస్‌.శ్రీనుబాబు, ఎస్సీ విభాగం రాష్ట్ర నాయకులు ఎం శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ సీహెచ్‌ వెంకటేశ్వరరావు, కొవ్వూరు వీరమహిళా విభాగం నేత చెట్టి సుబాషిణి, జనసేన అమలాపురం మండల పార్టీ జనరల్‌ సెక్రటరీ కె చినబాబుతో పాటు జనసేన పార్టీ వివిధ విభాగాలకు చెందిన ఇతర నేతలు వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.