రాయలసీమలో జనసేన పార్టీకి భారీ షాక్
30 Apr, 2024 21:23 IST
చిత్తూరు: రాయలసీమలో జనసేన పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ రాయలసీమ కో-ఆర్డినేటర్ జ్యోతి జనసేనను వీడి వైయస్ఆర్‌సీపీలో చేరారు. మంగళవారం సీఎం వైయస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలో చేపట్టిన ప్రచార కార్యక్రమంలో జ్యోతి వైయస్ఆర్‌సీపీలో చేరారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమక్షంలో జనసేన రాయలసీమ కోఆర్డినేటర్ జ్యోతి, సాయి మహేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ ఛైర్మన్ డాక్టర్ కె. మునిరత్నం వైయస్ఆర్‌సీపీలో చేరారు.