అంబటి రాంబాబును పరామర్శించిన మొండితోక జగన్మోహనరావు

27 Feb, 2026 17:03 IST

 గుంటూరు: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు ఇటీవల అరెస్టు నుండి విడుదలైన నేపథ్యంలో ఆయనను నందిగామ మాజీ శాసన సభ్యులు మొండితోక జ‌గ‌న్మోహ‌నరావు  పరామర్శించారు. గుంటూరు నగరంలోని రాంబాబు నివాసానికి చేరుకున్న డా. మొండితోక జగన్మోహనరావు, నందిగామ నియోజకవర్గానికి చెందిన పార్టీ శ్రేణులతో కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ ప్రభుత్వ అక్రమ కేసుల నేపథ్యంలో జరిగిన అరెస్టును తీవ్రంగా ఖండించారు. అలాగే రాంబాబు గారి ఇంటిపై టీడీపీ గుండాలు దాడి చేయడాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు తగవని పేర్కొన్నారు. కార్యక్రమంలో నందిగామ వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.