సీఎం వైయస్ జగన్‌తోనే రాష్ట్ర భవిష్యత్తు
18 Apr, 2023 16:49 IST
అనంతపురం: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డితోనే రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని మంత్రి ఉషాశ్రీ చరణ్ అన్నారు. మంగళవారం కంబదూరు మండల పరిధిలోని గుద్దెళ్ళ గ్రామంలో స్ధానిక ప్రజాప్రతినిధులు సచివాలయ కన్వీనర్లు, గృహసారధులుతో కలిసి "జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం చేపట్టి మా నమ్మకం నువ్వే జగనన్న అంటూ ప్రతి ఇంటికి తిరుగుతూ మన జగనన్న పాలనలో జరుగుతున్న మంచిని మంత్రి అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వానికి ప్రస్తుత మన జగనన్న సంక్షేమ పాలనపై వ్యత్యాసంను వివరిస్తూ జగనన్న పాలనపై ప్రజా అభిప్రాయాన్ని సేకరించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికీ స్టిక్కర్ అతికించి, వైయస్ జగన్‌కు మద్దతుగా 82960 82960 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చి ముఖ్యమంత్రి సందేశాన్ని వినిపించి, వారితో సెల్ఫీ దిగారు.