టీడీపీ విషప్రచారానికి జననేత చెక్‌ పెట్టారు

27 Feb, 2019 12:34 IST

అమరావతి: తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారానికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెక్‌ పెట్టారని అవంతి శ్రీనివాస్‌ అన్నారు. వైయస్‌ జగన్‌ అమరావతిలో గృహప్రవేశం చేయడం శుభ పరిణామం అన్నారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితే రాజధాని మారుస్తారని టీడీపీ విషప్రచారం చేస్తోందని మండిపడ్డారు. తాడేపల్లిలో వైయస్‌ జగన్‌ నూతన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన అవంతి మీడియాతో మాట్లాడుతూ.. వైయస్‌ జగన్‌ రాజధానిని మార్చరని, రాజధాని అమరావతిలోనే ఉంటుందన్నారు. వైయస్‌ జగన్‌ ఇక్కడ ఇల్లు కట్టుకోవడమే అందుకు ఉదాహరణ అన్నారు. జననేత అమరావతికి రావడం కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని ఇస్తుందన్నారు. రాష్ట్ర ప్రజలంతా వైయస్‌ జగన్‌ను స్వాగతిస్తున్నారన్నారు.