శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ మహాసంప్రోక్షణకు ఆహ్వానం
25 May, 2023 16:57 IST
తాడేపల్లి: జమ్మూలో టీటీడీ నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయ మహాసంప్రోక్షణకు హాజరు కావాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ఆహ్వానించారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో టీటీడీ ఛైర్మన్ వైవీ. సుబ్బారెడ్డి, ఎస్.వి.గ్రూప్ ఆఫ్ టెంపుల్స్, న్యూఢిల్లీ ప్రెసిడెంట్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కలిశారు. జూన్ 3 నుంచి 8 వరకు జమ్మూ శ్రీవారి ఆలయంలో మహా సంప్రోక్షణ, 8న మిధున లగ్నంలో కళావాహన, ఆరాధన అనంతరం ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమాలకు హాజరు కావాలని వారు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ఆహ్వాన పత్రిక అందించారు.